Polytechnic Paper Leak Case: పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ కేసులో (Polytechnic Paper Leak Case) పోలీసులు పురోగతి సాధించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్షా ప్రశ్నపత్రం లీక్ అయిన సంగతి తెలిసిందే. స్వాతి కాలేజ్ (Swathi College)లో పేపర్ లీకైనట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి...నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు కళాశాల సిబ్బందితో పాటు అబ్జర్వర్‌ను సైతం అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే, పరీక్షకు అరగంట ముందు మాత్రమే ప్రశ్నాపత్రం లీక్ (Exam Paper Leak) అయిందని...స్వాతి కాలేజీ నుంచి ఈ లీక్ జరిగిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. స్వాతి కాలేజ్ కి గత ఏడాది నుండి అడ్మిషన్స్ తక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో... విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో పాస్ చేయించి...కొత్త విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్ పెంచుకునేందుకు కాలేజీ యాజమాన్యం ప్లాన్ చేసి పేపర్ లీక్‌కు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే... పరీక్షకు అరగంట ముందే స్వాతి కాలేజ్ యాజమాన్యం పేపర్‌ను లీక్ చేసింది. స్వాతి కళాశాల విద్యార్థులు తమ స్నేహితులకు వాట్సప్‌లో పేపర్ పంపడంతో పేపర్ లీక్ ఘటన వెలుగుచూసింది.
Also Read: Voting On liquor shop: మా ఏరియాలో వైన్స్ వద్దంటూ 95 శాతం మంది ఓటింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook