Telangana Govt: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి సందడి మెుదలైంది. రాములోరి ఆలయాలన్నీ శ్రీరామనవమికి ముస్తాబు అవుతున్నాయి. శ్రీరాముడి జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 17వ తేదీ బుధవారం సెలవు దినంగా ప్రకటించింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఆరోజు తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా విద్యాసంస్థలు పూర్తిగా బంద్ అవుతాయి. దీంతో స్టూడెంట్స్ పండగ చేసుకుంటున్నారు.
భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర..
మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శ్రీరామనవమి శోభాయాత్రకు శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర హైదరాబాద్ ధూల్ పేటలోని ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభం అవుతుంది. దీనిని విజయవంతంగా చేయాలని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు రాజా సింగ్. ఈ శోభా యాత్ర సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది రేవంత్ సర్కార్. ఈ యాత్ర ఏయే మార్గాల్లో సాగుతుందో ఆక్కడ భద్రతను పెంచనున్నారు.
Also Read: Wine Shops Close: తెలంగాణలో వైన్స్ దుకాణాలు బంద్.. ఇక్కడే ఒక మెలిక ఏమిటంటే?
ముస్తాబు అవుతున్న అయోధ్య..
అయితే ప్రతి ఏటా చైత్ర శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. దీని ప్రకారం, ఏప్రిల్ 17న ఈ పండుగను చేసుకోనున్నారు. హిందూ మత గ్రంథాల ప్రకారం, శ్రీరామచంద్రుడు ఈ రోజే జన్మించాడని నమ్ముతారు. రాములోరి జన్మభూమి అయిన అయోధ్యలో శ్రీరామనవమి ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని కన్నుల పండువగా ముస్తాబు చేయనున్నారు. ఆ రోజు ఏకపత్నివ్రతుడిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుండి సుమారు 50 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. దీని కోసం అయోధ్య ట్రస్టు భారీగా ఏర్పాట్లు చేస్తుంది.
Also Read: Epuri Somanna : కేసీఆర్‌కు భారీ షాక్.. బీఆర్‌ఎస్ పార్టీని వీడిన ప్రముఖ గాయకుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter