మూడు నెలల్లోగా ఎన్నికలు జరపాలంటూ హైకోర్టు ఆదేశం

                            

Updated: Oct 12, 2018, 02:06 PM IST
మూడు నెలల్లోగా ఎన్నికలు జరపాలంటూ హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌:  తెలంగాణ పంచాయితీ ఎన్నికల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలవరించింది. మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పు చెప్పింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి..ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.

గడవు ముసినప్పటికీ  పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోకపోవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి అని పేర్కొన్న కోర్టు.. ..ఏవో కారణాలు చెప్పి వాటిని వాయిదా వేయడం సరైంది కాదని అభిప్రాయపడింది.  తక్షణమే ఎన్నిలకు సంబంధించిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 

పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఇటీవల కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గడువు ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించడం చట్ట విరుద్ధంమంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఈ మేరకు తీర్పును వెలవరించింది.