తెలంగాణలో 1000కి చేరువలో పాజిటివ్ కేసుల సంఖ్య

తెలంగాణలో శుక్రవారం 13 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కు చేరింది ఆయన అన్నారు.

Last Updated : Apr 24, 2020, 07:41 PM IST
తెలంగాణలో 1000కి చేరువలో పాజిటివ్ కేసుల సంఖ్య

హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 13 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కు చేరింది ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 25 మంది మృతి చెందగా కరోనా నుంచి కోలుకుని 291 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 663 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. వికారాబాద్, సూర్యాపేట, గద్వాల, జిహెచ్ఎంసి పరిధిలో కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రి ఈటల వెల్లడించారు.

Also read : Crocodile video: పంట పొలాల్లో ప్రత్యక్షమైన మొసలి

తెలంగాణలో వికారాబాద్, గద్వాల, సూర్యపేట, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయని మంత్రి పేర్కొన్నారు. వికారాబాద్ లో 14 కుటుంబాలు కరోనాబారిన పడగా ఆ 14 కుటుంబాల నుంచి 38 మందికి పాజిటివ్ అని తేలిందన్నారు. గద్వాలలో 30 కుటుంబాల్లో 45 మందికి, సూర్యాపేట జిల్లాలో 25 కుటుంబాలకు కరోనా సోకగా ఆ కుటుంబాల్లో 83 మందికి పాజిటివ్ అని వచ్చిందని గుర్తించినట్టు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 44 కుటుంబాలపై కరోనా వైరస్ ప్రభావం చూపగా 260 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు.

Also : Hyderabad: భోజనం అవసరమైతే ఈ నెంబర్‌కి ఫోన్ చేయండి: సీఎస్ సోమేష్ కుమార్

కరోనా కట్టడికి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల వద్ద వైద్యులకు రక్షణ చర్యలు కల్పిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News