/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

HEAVY RAIN:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభాంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవగా.. మరికొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. గత  24 గంటల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నిజామాబాద్, మంచిర్యాల. కామారెడ్డి, జగిత్యాల నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కొండూరులో 186 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్ లో 178, నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లిలో 158, సూర్యాపేట జిల్లా మునగాలలో 156 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా ఆలూరులో 137, లక్మాపూర్ లో 132, మాచర్లలో127, మదనపల్లిలో 121, పైడాలో 119,యర్గిల్లాలో 117 మిల్లిమీటర్ల భారీ వర్షం కురిసింది. మరో 10 కేంద్రాల్లోనూ 100 మిల్లిమీటర్లపైగా వర్షం కురిసింది. 

రాబోయే రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 9 జిల్లాలకు రెడ్ ఎలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ ఆలెర్ట్ జారీ చేసింది. మిగితా జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా అదిలాబాద్ ,కొమరం భీం, నిర్మల్, జగిత్యాల్ ,మంచిర్యాల్, నిజాంబాద్ ,కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ,మహబూబాబాద్, వరంగల్ ,హనుమకొండ ,సిద్దిపేట్, మెదక్ ,సంగారెడ్డి , వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, జనగాం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ ,మహబూబ్ నగర్, నారాయణపేట ,వనపర్తి, జోగులంబ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ  వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాథ అధికారులు చెప్పారు.

భారీ వర్షాలకు వరదలు పోటెత్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, రిజర్వాయర్లలోకి వరద నీరు చేరుతోంది. కొమరం భీమ్ జిల్లా వట్టి వాగు ప్రాజెక్ట్ లోకి వరద రావడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2405 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2405 క్యూసెక్కులుగా ఉంది. గడ్డెన్న వాగు కూడా నిండిపోయంది. కడెం ప్రాజెక్టు గేట్లు వదిలారు. కాళేశ్వరం ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు.

Also read : YSR Jayanthi 2022: వైఎస్ఆర్ జయంతి.. వైఎస్ఆర్‌కి ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్ ? వైయస్ఆర్ డెత్ మిస్టరీ ఏంటి ?

Also Read : YS Vijayamma: విజయమ్మ తప్పుకుందా.. తప్పించారా! ఇడుపాలపాయలో రాత్రి ఏం జరిగింది..?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Section: 
English Title: 
HEAVY RAINS IN TELANGANA..IMD RED ALERT TO THREE DISTRICTS AND YEELOW ALERT TO 14 DISTRICTS
News Source: 
Home Title: 

HEAVY RAIN:తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. మరో మూడు రోజులు ఇంతే..

HEAVY RAIN:తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్.. మరో మూడు రోజులు ఇంతే..
Caption: 
FILE PHOTO heavy rains
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు 

నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ 

ప్రాజెక్టులకు చేరుతున్న వరద

Mobile Title: 
HEAVY RAIN:తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్..
Srisailam
Publish Later: 
No
Publish At: 
Saturday, July 9, 2022 - 06:54
Request Count: 
84
Is Breaking News: 
No