Heat Waves Alert: ఈ వేసవి పూర్తిగా భయపెడుతోంది. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతన్నాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. అతికష్టంగా ఏప్రిల్ గడిచింది. ఇక మే నెల ఎలా ఉంటుందోననే భయం వెంటాడుతోంది. నల్గొండ, ఖమ్మం వంటి ప్రాంతాల్లో అత్యధికంగా 45-46 డిగ్రీలు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది.
వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలో నమోదయ్యాయని వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నారు. ఓ వైపు భారీగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు మరోవైపు తీవ్రమైన వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. జనం బయటకు రావడానికి భయపడుతుండటంతో పగలు రోడ్లు నిర్మాణుష్యంగా మారుతున్నాయి. నిత్యావసర వస్తువుల కోసం జనం కూడా ఉదయం లేదా సాయంత్రం పూటే బయటకు వస్తున్నారు. ఇక రాత్రి పూట కూడా పరిస్థితి అలాగే ఉంది. రాత్రుళ్లు కూడా వాతావరణం చల్లబడకపోవడంతో వేడిగాలులు, ఉక్కపోతతో జనం విలవిల్లాడుతున్నారు.
మొన్న నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు కరీంనగర్‌లో సైతం 46 డిగ్రీలు రికార్డ్ అయింది. తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాల్లో అత్యధికంగా 45 డిగ్రీలు దాటిన పరిస్థితి ఉంది. కనిష్టం అంటే హైదరాబాద్‌లో 43.2 డిగ్రీలు నమోదైంది. తెలంగాణలో మొత్తం 30 జిల్లాల్లో 43-44 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
రెడ్ జోన్‌లో తెలంగాణ జిల్లాలివే
రాష్ట్రంలోని వరంగల్, జనగామ, పెద్దపల్లి, మంచిర్యాల, నల్గొండ, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, వనపర్తి, గద్వాల జిల్లాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. రానున్న రెండ్రోజుల్లో ఈ జిల్లాల్లో 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదు కావచ్చని అంచనా.
13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రానున్న 2-3 రోజులు తెలంగాణలోని 13 జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీయనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 6 వతేదీ వరకూ ఈ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దక్షిణ, నైరుతి దిశల్నించి వీస్తున్న గాలుల కారణంగా వడగాల్పుల తీవ్రత పెరుగుతోందని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణం నెలకొంది. రానున్న 4-5 రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండనున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also read: KCR Ban: కేసీఆర్‌కు ఎన్నికల సంఘం ఝలక్.. 48 గంటల పాటు ప్రచారం నిషేధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook