హైదరాబాద్ థియేటర్లో ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జనగాం జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన బిక్షపతి అనే యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతితో తనకు ఇటీవలే ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది.ఆ యువకుడు హైదరాబాద్‌లో బంధువులను కలవడానికి వచ్చినప్పుడు తనకు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన యువతిని రెండుసార్లు కలిశాడు. ఇటీవలే వీరిద్దరూ కలిసినప్పుడు పార్కుకు వెళ్లి, అక్కడి నుంచి "పద్మావత్" చిత్రం ఆడుతున్న సినిమా థియేటర్‌కి వెళ్లారు. థియేటర్లో జనం తక్కువగా ఉండటంతో.. బిక్షపతి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో ఆ యువతికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఇంటికి వచ్చిన ఆమెను తల్లితండ్రులు ఆరాతీయగా జరిగిందంతా చెప్పింది. బాధిత కుటుంబం స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేయగా.. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.