Suryapeta District atmakur SI lingam attach to vr in sensetional Ramojithanda Gugulothu Veerashekhar case: సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) ఎస్ఐ లింగంపై బదిలీ వేటు పడింది. ఎస్ఐ లింగంను (SI lingam) ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వీఆర్ (వెకన్సీ రిజర్వ్)కు పంపారు. దొంగతనం ఆరోపణలతో ఓ గిరిజన యువకుడిని (Tribal youth) పోలీసులు దారుణంగా కొట్టారని సూర్యాపేట జిల్లా (Suryapet District) ఆత్మకూర్(ఎస్) పోలీస్‌స్టేషన్ ఎదుట తాజాగా గిరిజనులు ఆందోళనకు దిగారు.
ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్‌లో (Atmakoor (S) Epoor) గత నెలలో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మండలంలోని రామోజీతండాకు చెందిన నవీన్ (Naveen) అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. తనతోపాటు అదే తండాకు చెందిన గుగులోతు వీరశేఖర్ (Gugulothu Veerashekhar) ఉన్నట్టు పోలీసులకు చెప్పాడు. దీంతో గుగులోతు వీరశేఖర్ ను ఎస్సై లింగం స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టాడు. తర్వాత అతను అస్వస్థతకు గురయ్యాడంటూ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. గుగులోతు వీరశేఖర్ ను (Guguloth Veera Sekhar) ఇంటికి తీసుకెళ్లమని ఎస్సై లింగం వారికి చెప్పారు. ఇంటికి వెళ్లిన తరువాత వీరశేఖర్ పరిస్థితి విషమించడంతో అతని కుటుంబసభ్యులు గ్రామస్థులతో కలిసి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు.
పోలీసులు (Police) తనను చితకబాదాడని, కాళ్ల మీద పడ్డా కనికరం చూపలేదని బాధితుడు ఆరోపించారు. గుగులోతు వీరశేఖర్ పరిస్థితి అలా కావడానికి కారణమైన పోలీసులను వెంటనే విధుల నుంచి తొలగించాలని బాధితుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Also Read : TRS protest : తెలంగాణ అంతటా టీఆర్‌ఎస్ ధర్నా..యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్
కాగా.. ఈ ఘటన జై భీమ్‌లో (Jai Bhim) ఓ సీన్‌ను తలిపిస్తోదంటూ అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సూర్య నటించిన జైభీమ్ సినిమా సంచలనం రేపిన విషయం తెలిసిందే. విచారణ పేరుతో పోలీసులు (Police) చిత్ర హింసలు పెడతారన్న దృశ్యాలు అందర్నీ కదిలించాయి. చేయని నేరానికి అమాయకులైన గిరిజనులను (Tribals) కేసుల్లో ఇరికించి, పోలీసులు ఎలా చావగొడతారనే కథాంశంతో వచ్చిన ఈ మూవీ అందరినీ ఆలోచింపజేసింది.
ఇప్పడు రామోజీ తండాకు (Ramoji Tanda) చెందిన ధరావత్ వీరశేఖర్ ఘటన నేపథ్యంలో అందరూ ఆ సీన్స్‌నే గుర్తు చేసుకున్నారు. జై భీమ్ సినిమాను తలపిస్తున్న ఈ ఘటనలో పోలీసుల (Police) తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆత్మకూరు ఘటనలోనూ పోలీసులు తీసుకొచ్చి కొట్టి అసలేమీ తెలియదని చెబుతున్నారంటూ బాధితులు ఆందోళన చేశారు. నడవలేని స్థితిలో ఉన్న బాధితుడు వీరశేఖర్‌ను చేతులపై తీసుకొచ్చి పోలీస్‌స్టేషన్ (Police Station) ఎదుట రామోజీతండా వాసులు ఆందోళనకు దిగారు.
Also Read : Flex Fuel Engines: గుడ్ న్యూస్..తగ్గనున్న పెట్రో-డీజిల్ ధరలు..లీటర్‌కు రూ.62: గడ్కరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి