తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగింత

  తప్పిపోయిన బాలిక జాడ తెలుసుకొన్న హైదరాబాద్ పోలీసులు పాప తల్లిదండ్రులకు అప్పగించారు.

Last Updated : Dec 18, 2017, 06:01 AM IST
తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగింత

హైదరాబాద్:  తప్పిపోయిన బాలిక జాడ తెలుసుకొన్న హైదరాబాద్ పోలీసులు ఆమెను తన తల్లిదండ్రులకు అప్పగించారు.  గత కొన్ని రోజుల క్రితం తమ పాప తప్పిపోయిందని ఆయా బాలిక తల్లిదండ్రులు ఆసిఫ్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు..బాలిక కోసం విస్తృతంగా ​గాలించారు. ఎట్టకేలకు పాప జాడ తెలుసుకున్నారు. చిన్నారిని మెహదీపట్నంలోని అంబా థియేటర్ దగ్గర గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఆ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. బాధ్యతాయుతంగా వ్యవహరించి సకాలంలో పాప జాడ కనుకొన్న ఆసిఫ్ నగర్ పోలీసుల పై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది.

 

 

 

Trending News