Telangana Rain Alert:13 జిల్లాలకు రెడ్ అలర్ట్.. తెలంగాణలో మళ్లీ వరద గండం

Telangana Rain Alert: వరదల ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే మరోసారి వరద గండం ముంచుకొస్తోంది. తెలంగాణకు తాజాగా మరోసారి హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Written by - Srisailam | Last Updated : Aug 6, 2022, 07:48 AM IST
  • తెలంగాణకు మళ్లీ గండం
  • రెండు రోజుల భారీ వర్ష సూచన
  • 13 జిల్లాలకు రెడ్ అలెర్ట్
Telangana Rain Alert:13 జిల్లాలకు రెడ్ అలర్ట్.. తెలంగాణలో మళ్లీ వరద గండం

Telangana Rain Alert: తెలంగాణపై వరుణుడు పగ బట్టినట్లు ఉన్నారు. అదే పనిగా ప్రతాపం చూపిస్తూ అతలాకుతలం చేస్తున్నాడు. ఇటీవల వారం రోజుల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షాలకు రాష్ట్రమంతా వరద పోటెత్తింది. వందలాది గ్రామాలను ముంచెత్తింది. లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జూలై నెలలోనే గోదావరి మహోగ్రరూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్ని ప్రస్తుతం నిండుకుండలా ఉన్నాయి. వరదల ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే మరోసారి వరద గండం ముంచుకొస్తోంది. తెలంగాణకు తాజాగా మరోసారి హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.

తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణ నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 7న  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు రుతుపవణ ద్రోణి వ్యాపించి ఉంది.  దీని ప్రభావంతో రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా ఈనెల 9వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, వికారాబాద్‌ మహబూబాబాద్‌, సిద్దిపేట్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ప్రాజెక్టులన్ని ఫుల్లుగా ఉండటంతో ప్రాజెక్టుల వద్ద అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.అల్పపీడనంగా ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారుల హెచ్చరికతో ఆందోళన నెలకొంది. 

Read Also: Etela Rajender: బీజేపీతో మరికొంత మంది టచ్‌లో ఉన్నారు..ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు..!

Read Also: Free Entry: హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్..ఇకపై చార్మినార్, గోల్కొండ కోటలో ఫ్రీ ఎంట్రీ..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News