పీసీసీ చీఫ్ ఎన్నికపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు

పీసీసీ చీఫ్ ఎన్నికపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు

Last Updated : Nov 16, 2019, 03:55 PM IST
పీసీసీ చీఫ్ ఎన్నికపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్: తరచుగా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒకరైన సంగా రెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టంచేసిన జగ్గా రెడ్డి.. ఇకపై ఫుల్ టైమ్‌ పార్టీ కోసమే పనిచేస్తానని అన్నారు. సంగారెడ్డిలో తాను కాకుండా తన స్థానంలో మరొకరిని బరిలో దింపి గెలిపిస్తానన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కోసం దాదాపు 10 మంది నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న జగ్గా రెడ్డి.. ఆ తర్వాతే తన నంబర్‌ అని పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నిస్తోన్న తాను కూడా ఈ నెల 20 తర్వాత హస్తినకు వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి ఇక్కడి పరిస్థితులపై వివరిస్తానని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సడక్‌ బంద్‌కు సంఘీభావంగా సంగారెడ్డిలో హైవేని దిగ్బందిస్తామని ఆయన తేల్చిచెప్పారు. 

పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీపడుతున్న వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వీహెచ్, రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీ జీవన్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు ఉన్నారనే సంగతి తెలిసిందే.

Trending News