అనారోగ్యంతో జర్నలిస్ట్ రాజా మృతి

కరోనా కష్టకాలంలో మరో జర్నలిస్టు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో సబ్ ఎడిటర్ అక్కలదేవి రాజా కన్నుమూశాడు. జర్నలిస్ట్ రాజా మరణంపై జర్నలిస్ట్ సంఘాలు సంతాపం ప్రకటించాయి. రాజా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాయి. 

Last Updated : Aug 14, 2020, 02:50 PM IST
అనారోగ్యంతో జర్నలిస్ట్ రాజా మృతి

కరోనా వ్యాప్తి సమయంలో జర్నలిస్టుల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఓవైపు రెగ్యూలర్ అనారోగ్య సమస్యలతో కొందరు సతమతమవుతుంటే.. మరోవైపు వార్తల రిపోర్టింగ్‌కు వెళ్లి కొందరు జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాజా అక్కలదేవి అనారోగ్యంతో మృతిచెందాడు. ఆంధ్రజ్యోతి మహబూబ్​నగర్ యూనిట్​ కార్యాలయంలో సబ్​ఎడిటర్‌గా రాజా విధులు నిర్వహిస్తున్నాడు. COVID19 నుంచి కోలుకున్న భారత అరుదైన క్రికెటర్

గత కొంతకాలంగా క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడుతున్న రాజా తనువు చాలించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా వాసి అయిన రాజా.. నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికల్లోనూ సబ్​ఎడిటర్‌గా సేవలందించాడు. సీనియర్ జర్నలిస్ట్ రాజా మరణంపై జర్నలిస్ట్ సంఘాలు సంతాపం ప్రకటించాయి. రాజా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాయి. Telangana: ఒకే ఇంట్లో నలుగురు మృతి.. క్షుద్ర పూజలే కారణమా..?

Trending News