Telangana: ఒకే ఇంట్లో నలుగురు మృతి.. క్షుద్ర పూజలే కారణమా..?

తెలంగాణ ( Telangana ) లోని వనపర్తి జిల్లాలో ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన రాష్ట్రం అంతటా కలకలం రేపుతోంది. అసలు దీనికి కారణం క్షుద్ర పూజలా లేక.. ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Last Updated : Aug 14, 2020, 11:54 AM IST
Telangana: ఒకే ఇంట్లో నలుగురు మృతి.. క్షుద్ర పూజలే కారణమా..?

Four family members suspicious death: హైదరాబాద్: తెలంగాణ ( Telangana ) లోని వనపర్తి జిల్లాలో ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన రాష్ట్రం అంతటా కలకలం రేపుతోంది. అసలు దీనికి కారణం క్షుద్ర పూజలా లేక.. ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వనపర్తి జిల్లా ( wanaparthy ) లోని రేవల్లి మండలం నాగపూర్‌లోని ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి శవాలు వేరు వేరు చోట్ల లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రామానికి చెందిన అజీరాం బీ(63), ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా (10) మృతదేహాలు ఇంట్లో వేర్వేరు చోట పడి ఉన్నాయి. అయితే.. అక్కడక్కడ పడి ఉన్న మృతదేహాలను చూసి షాక్‌నకు గురైన ఇరుగుపొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు (TSPolice)  ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. Also read: India: 25లక్షలకు చేరువలో కరోనా కేసులు

అయితే సంఘటన స్థలంలో పలుచోట్ల గుంతలు తవ్వి ఉండటం.. ఇంటి ఆవరణంలో కుంకుమ, పసుపు, అగరబత్తీలు, నిమ్మకాయలు ఉండటం అందరిని భయాందోళనకు గురిచేస్తోంది. అయితే స్థానికులు ఆ ఇంట్లో క్షద్రపూజలు జరిగి ఉంటాయన్న అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉంటే.. కుటుంబసభ్యులందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా.. లేకపోతే ఎవరైనా హ్యతచేశారా.. క్షుద్రపూజల్లో భాగంగా ఎవరైనా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. Also read: Narendra Modi: కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు

Trending News