జేపి నడ్డా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ వివరాలు

జేపి నడ్డా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ వివరాలు

Last Updated : Aug 18, 2019, 06:39 PM IST
జేపి నడ్డా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ వివరాలు

బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు జేపీ నడ్డా శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకోనున్న ఆయన మధ్యాహ్నం 3 గంటలకు పార్టీలో కీలక నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభకు జేపి నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ బహిరంగ సభలోనే జేపీ నడ్డా సమక్షంలో పలువురు టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. రాత్రి 7 గంటలకు రాష్ట్ర కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొననున్న అనంతరం జేపి నడ్డా ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. 

జేపి నడ్డా రాక అనంతరం ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తల చేరికలతో ఆయా పార్టీలు బలహీనపడితే, తెలంగాణలో బీజేపి మరింత బలపడనుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Trending News