కోఠి మెడికల్ కాలేజీలో Junior doctors protest

పీజీ మెడికల్ సీట్ల ఫీజులు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోఠి మెడికల్ కాలేజీలో నేడు జూనియర్ డాక్టర్స్ ( Junior doctors association) ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జూడాలు డిమాండ్ చేశారు.

Last Updated : May 7, 2020, 07:59 PM IST
కోఠి మెడికల్ కాలేజీలో Junior doctors protest

హైదరాబాద్ : పీజీ మెడికల్ సీట్ల ఫీజులు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోఠి మెడికల్ కాలేజీలో నేడు జూనియర్ డాక్టర్స్ ( Junior doctors association) ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జూడాలు డిమాండ్ చేశారు. కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలయ్యాక ఫీజులు పెంచడం సరైంది కాదన్న జూనియర్ డాక్టర్లు.. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుకూలంగా వ్యవహరించడానికే ఫీజులు పెంచారని ఆరోపించారు. 2017లో పెంచిన ఫిజులపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడాన్ని గుర్తుచేస్తూ.. కోర్టు నుంచి ఇంకా పూర్తి జడ్జిమెంట్ రాక ముందే అప్పుడే ఫీజులు ఎలా పెంచుతారని జూడాలు నిలదీశారు. అందుకే తక్షణమే జీఓ 28ని రద్దు చేయాలని జూడాలు డిమాండ్ చేశారు. 

Also read : Vizag tragedy : మృతుల కుటుంబాలకు రూ కోటి ఎక్స్‌గ్రేషియా

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జూనియర్ డాక్టర్స్.. కరోనాతో పోరాడే వైద్యులు, ఇప్పుడు ఆ పని పక్కనపెట్టి ఈ ఫీజు పెంపునకు వ్యతిరేకంగా ప్రభుత్వంతో పోరాడాలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News