K Kavitha: తారక రామన్నకు రాఖీ కట్టిన కవిత.. మళ్లీ అదే మాట పునరుద్ఘాటన

K Kavitha Enters Home Land After Release From Tihar Jail: స్వరాష్ట్రంలోకి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత అడుగుపెట్టారు. ఆమెకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 28, 2024, 08:32 PM IST
K Kavitha: తారక రామన్నకు రాఖీ కట్టిన కవిత.. మళ్లీ అదే మాట పునరుద్ఘాటన

 K Kavitha Emotional: బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. దాదాపు ఐదున్నర నెలల పాటు జైలులో ఉన్న ఆమె బుధవారం స్వరాష్ట్రం చేరుకున్నారు. స్వరాష్ట్రం చేరుకున్న కవితకు పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులతోపాటు ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఇంట్లోకి వెళ్లిన అనంతరం కవిత పూజా మందిరంలో పూజలు చేశారు. అనంతరం భర్త అనిల్‌ కుమార్‌, తల్లి శోభమ్మ ఆశీర్వాదం పొందారు. అనంతరం తన సోదరుడు, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు రాఖీ కట్టారు.

Also Read: KTR: మళ్లీ చెబుతున్నాం.. రాసి పెట్టుకో.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మాస్ వార్నింగ్

జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో కవిత రాకతో సందడిగా మారింది. పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆమె అభిమానులు పోటెత్తడంతో జూబ్లీహిల్స్‌ ప్రాంతం గులాబీమయంగా మారింది. కాగా కవితను కలిసేందుకు పెద్ద ఎత్తున నాయకులు తరలివచ్చారు. ఇక కుటుంబసభ్యులందరూ కవిత నివాసానికి చేరుకున్నారు. కేటీఆర్‌ సతీమణి శైలిమ, వారి పిల్లలు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ కుటుంబసభ్యులు, కవిత అత్తమ్మలు (కేసీఆర్‌ సోదరిమణులు) చేరుకుని కవితను ఆశీర్వదించారు.

Also Read: K Kavitha: జైలు బయట బోరున ఏడ్చిన కవిత.. వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరిక

ముత్యంలా బయటకు వస్తా
అంతకుముందు తన నివాసం బయట కవిత మీడియాతో మాట్లాడారు. మరోసారి తాను తప్పు చేయలేదని పునరుద్ఘాటించారు. తనపై కుట్ర చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని స్పష్టం చేశారు. 'ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తాను. చరిత్రలో ఎప్పుడైనా న్యాయమే గెలిచింది. న్యాయమే గెలుస్తుందని చాలా సందర్బాల్లో రుజువు అయింది. నాకు వెన్నుదన్నుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. నాపై కుట్ర చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా' అని కవిత తెలిపారు. 'రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ నాయకత్వంలో జరుగుతున్న అనేక పోరాటాల్లో పాల్గొంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పోరాటం చేస్తాం. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా' అని కవిత చెప్పారు. ఆమె తిరిగి రాజకీయాల్లో మరింత ఉత్సాహంతో పని చేసేందుకు సిద్ధమని ఆ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News