Raghunandan Rao: టీఆర్‌‌ఎస్ భాష చాలా దారుణమంటోన్న బీజేపీ ఎమ్మెల్యే!

Raghunandan Rao Comments On TRS: తమ ఎంపీల ఓటు వల్లే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్‌ పాస్ అయ్యిందని.. ఇప్పుడు తమ పార్టీని తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారంటూ టీఆర్‌‌ఎస్‌పై ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఫైర్ అయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 05:15 PM IST
  • సీఎం కేసీఆర్‌‌, ఆయన కుటుంబంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఫైర్
  • తెలంగాణ సెంటిమెంట్‌తో రెచ్చగొడుతున్నారు..
  • ప్రధాని మోదీ తెలంగాణకు వ్యతిరేకం అంటూ ప్రచారం చేస్తున్నారు..
  • తల్లిని... చెల్లిని కూడా గౌరవించలేనంతగా టీఆర్‌‌ఎస్ భాష ఉందని ఆగ్రహం...
Raghunandan Rao: టీఆర్‌‌ఎస్ భాష చాలా దారుణమంటోన్న బీజేపీ ఎమ్మెల్యే!

Raghunandan Rao Comments: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్‌ కూతురు కవితతో పాటు మంత్రి హరీశ్‌రావు దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఫైర్ అయ్యారు. వారంతా తెలంగాణ సెంటిమెంట్‌తో రెచ్చగొడుతున్నారన్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని బద్నం చేయాలని చూస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. 

భారతీయ జనతా పార్టీ అలాగే ప్రధాని మోదీ తెలంగాణకు వ్యతిరేకం అంటూ కేసీఆర్‌‌తో పాటు ఆయన కుటుం సభ్యులు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సీరియస్ అయ్యారు. ఇక టీఆర్‌‌ఎస్‌ భాష చాలా దారుణంగా ఉంటుందని.. కనీసం తల్లిని... చెల్లిని కూడా గౌరవించలేనంతగా టీఆర్‌‌ఎస్ భాష ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నార్త్‌ ఇండియా.. సౌత్ ఇండియా అంటూ ప్రకాశ్ రాజ్‌.. కమల హాసన్‌లు ఓడిపోయారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నార్త్‌ ఇండియాకు భారతీయ జనతా పార్టీ ఎంపీల ఓటు వల్లే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్‌ పాస్ అయ్యిందన్నారు. 

ఈ సన్నాసులు రాజకీయాల్లోకి రాక ముందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవారన్నారు. ముఖ్యంత్రితో మాట్లాడాలంటే ఒక స్థాయి ఉండాలంటోన్న మంత్రి హరీశ్ రావు మాటల్ని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తప్పుబట్టారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంతో పోరాడారని ఆయన అన్నారు. బీజేపీకి అధికారం దక్కితే ఆంధప్రదేశ్‌, తెలంగాణలను కలుపుతారంటూ మంత్రి కేటీఆర్‌ అంటున్నారని.. ఇది ఏ మాత్రం వాస్తవం కాదన్నారు. 

హైదరాబాద్‌ను బలవంతంగా దేశంలో కలిపారంటూ కేసీఆర్‌‌ కూతురు కవిత అంటున్నారని.. మరి తెలంగాణ వేరే దేశంగా ఏమైనా ఉండాలని ఆమె కోరుకుంటుందా అని రఘునందన్‌ రావు ప్రశ్నించారు. 

హిజాబ్ వివాదానికి భారతీయ జనతా పార్టీకి అసలు సంబంధం లేదన్నారు. కేసీఆర్ ముందస్తు ఎలక్షన్ల కోసం కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. కేసీఆర్‌‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా తెలంగాణ తమ వల్లే ఏర్పడిందంటూ అబద్దాలు చెప్తున్నారని ఆయన విమర్శించారు.

Also Read: IND vs WI: వైడ్ ఇచ్చిన అంపైర్.. డీఆర్‌ఎస్ కోరిన రోహిత్ శర్మ! ఆ తర్వాత ఏమైందంటే? (వీడియో)  

Also Read: Model Fall Down: లైవ్ లో స్టేజ్ పై కుప్పకూలిపోయిన మహిళా మోడల్ - ఏం జరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News