పులిరాజాల సంఖ్యను గణనీయంగా పెంచిన కేసీఆర్ సర్కార్ !!

వన్య ప్రాణుల సంరక్షణ  విషయంలో పటిష్ట చర్యలు తీసుకుంటుకన్న కేసీఆర్ సర్కార్.. అందుకు తగ్గ ఫలితాన్ని సాధించింది.

Last Updated : Jul 29, 2019, 09:53 PM IST
పులిరాజాల సంఖ్యను గణనీయంగా పెంచిన కేసీఆర్ సర్కార్ !!

హైదరాబాాద్: అటవీ, వన్యప్రాణుల సంరక్షణ  విషయంలో చర్యలు తీసుకుంటుకన్న కేసీఆర్ సర్కార్.. అందుకు తగ్గ  ఫలితాన్ని సాధించింది. ఒకవైపు వివిధ కారణాల వల్ల అడవుల్లో పెద్ద పులుల సంఖ్య రోజు రోజు అంతరించి పోతుంటే..తెలంగాణ అటవుల్లో అందుకు భిన్నమైన ఫలితం వచ్చింది. తెలంగాణ అడవుల్లో గతంలో 20 పులులు ఉన్నట్లు ఓ అంచనా ఉండేదని.. ఇప్పుడు వాటి సంఖ్య సంఖ్య 26కి చేరింది. ఉన్నట్లుండి పులుల ప్రస్తావన ఎందుకు వచ్చిందనేగా ఈ మీ ప్రశ్న...అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే తెలుస్తుంది.

టి.అటవీశాఖకు మోడీ ప్రశంసలు

అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆలిండియా టైగర్‌ ఎస్టిమేషన్‌ రిపోర్ట్‌-2018 ను సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పులుల లెక్కలను ఆయా రాష్ట్రాల అటవీశాఖల నుంచి అందిన నివేదిక ఆధారంగా కేంద్రం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ అటవీశాఖకు సంబంధించిన రిపోర్టుకు కూడా ఇలా బయటపడింది. పులుల పెరుగుదల గణనీయంగా పెరగడంతో తెలంగాణలో పులుల సంరక్షణ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం మంచి రేటింగ్‌ను ఇచ్చింది.

బాధ్యత మరింత పెరిగింది ..

తెలంగాణ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ అటవీశాఖ చేపట్టిన అటవీ రక్షణ చర్యల వల్లే పులుల సంఖ్య పెరిగేందుకు దోహదపడిందన్నారు. వేటాడడం, అడవుల నరికివేత, ఆవాసాల విధ్వంసం, పర్యావరణ మార్పులు, మనిషి - పులుల మధ్య ఘర్షణ తదితర కారణాల వల్ల పులులు, ఇతర వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని ... వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి పేర్కొన్నారు

Trending News