CM KCR:తెలంగాణలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్. రాష్ట్రంలో దర్యాప్తు కోసం గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 51ను విడుదల చేసింది. ఆగస్ట్ 31నే తెలంగాణ హోం శాఖ దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది.
Kodandaram Slams KCR: కేసీఆర్ సర్కారు పోవాలంటే ప్రజల్లో మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆంధ్రా పాలకులతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండాపోయిందని కోదండరామ్ ఆవేదన వ్యక్తంచేశారు.
Kcr New Scheme: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది నవంబర్ లో జరగాల్సి ఉంది. రాష్ట్రంలో మాత్రం ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.2018 తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం సాగుతోంది.
Group Jobs: తెలంగాణ కొలువుల జాతర కొనసాగుతోంది. వివిధ శాఖల్లో గుర్తించిన దాదావు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. శాఖల వారీగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.
BANDI SANJAY: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ లు, ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. పల్లె ప్రగతి బిల్లులు చెల్లించాలని సర్పంచ్ లు ఆందోళన చేస్తున్నారు. అప్పులు చేసిన పనులు చేసిన కొందరు సర్పంచ్ లు .. మూడేళ్లుగా బిల్లులు రాకపోవడంతో రోడ్డున పడ్డారు. అప్పుల బాధ తాళలేక కొందరు సర్పంచ్ లు సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి. కొందరు సర్పంచ్ లు భిక్షాటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.