Kcr vs Jagan: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ జోరు..ఏపీలో జగన్‌తో ఇక సమరమేనా..?

Kcr vs Jagan: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. త్వరలో పార్టీ స్థాపన ఉండనుంది. కుమారస్వామి భేటీలో ఈవిషయాన్ని స్పష్టం చేశారు. మరి ఆయనతో కలిసి వచ్చే వారు ఎవరు..? ఏ ఏ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది....? ఏపీ నుంచి సీఎం కేసీఆర్‌కు ఎలాంటి మద్దతు ఉంటుంది..? అక్కడ పోటీ చేయబోతున్నారా..? తాజాగా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.

Written by - Alla Swamy | Last Updated : Sep 12, 2022, 06:31 PM IST
  • జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్
  • త్వరలో పార్టీ స్థాపన
  • ఇప్పటికే నేతలతో మంతనాలు
Kcr vs Jagan: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ జోరు..ఏపీలో జగన్‌తో ఇక సమరమేనా..?

Kcr  vs Jagan: ఈఏడాది చివరిలోపు హైదరాబాద్‌ వేదికగా జాతీయ పార్టీ ఏర్పాటు కానుంది. ఈ దిశగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలతో మంతనాలు జరిపారు. దేశవ్యాప్తంగా ఆలిండియా టూర్ చేపట్టారు. పలు రాష్ట్రాల్లో సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీ, బీహార్, బెంగళూరు నగరాల్లో పర్యటించారు. ఇదే విషయంపై మంతనాలు జరిపారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. 

బీజేపీ ముక్త్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీయేతర అభ్యర్థులను బలపరిచారు. రానున్న రోజుల్లో ఇదే స్టాండ్‌తో ముందుకు వెళ్లనున్నారు. భారతీయ రాష్ట్రీయ సంఘ్‌ పేరుతో పార్టీ స్థాపన జరగనుందని తెలుస్తోంది. పార్టీ జెండా, అజెండాపై విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. రాజ్యాంగ, సమైక్య స్ఫూర్తే లక్ష్యంగా పార్టీ స్థాపన ఉండనుంది. రాష్ట్రాల హక్కులను బీజేపీ ప్రభుత్వం ఎలా అణిచి వేస్తోందో సీఎం కేసీఆర్ వివరించనున్నారు. 

ఐతే ఆయనకు ఎవరెవరూ మద్దతు ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సీఎం కేసీఆర్ ప్రభావం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠను రేపుతోంది. జాతీయ పార్టీగా అక్కడ పోటీ చేస్తారా లేక ఇతర పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్తారా.. ఒకవేళ పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ మధ్య దూరం పెరుగుతోంది. మొదట్లో  సీఎంల మధ్య స్నేహబద్ధం ఉన్నా..ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి.

జల, విద్యుత్ వివాదాలతో ఇరు రాష్ట్రాల మధ్య దూరం పెరిగింది. ఇటీవల గోదావరి వరదలపై ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం సాగింది. మరోవైపు బీజేపీకి వైసీపీ దగ్గరవుతోంది. కేంద్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా..మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతోంది. ఈనేపథ్యంలో కేసీఆర్, జగన్‌ ముఖాముఖిగా తలపడనున్నారు. ఏపీలోనూ సీఎం కేసీఆర్ అభిమానులు ఉన్నారు. పార్టీ స్థాపిస్తే ప్రజల్లోకి తీసుకెళ్తామని ఇప్పటికే కొందరు సీఎం కేసీఆర్ కోరారు. జాతీయ పార్టీతో ఆ లోటు తీరే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీతో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రాబోతోందన్న ప్రచారం జరుగుతోంది.

ఇటు ఆదివారం ప్రగతిభవన్‌లో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని సీఎం కేసీఆర్ కలిశారు. లంచ్‌ కార్యక్రమంలో ఇరువురి భేటీ జరిగింది. జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తోందని..ప్రత్యామ్నాయ కూటమి రావాల్సి ఉందని ఈసందర్భంగా ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీని కుమారస్వామి స్వాగతించారు. రాజకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమయ్యిందని కేసీఆర్, కుమార స్వామి ఆక్షేపించారు. 

దేశంలో విభజన సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని..వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కర్ణాటక నుంచి సీఎం కేసీఆర్‌కు జేడీయూ మద్దతు ఖాయమైంది. ఐతే ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి మద్దతు ఉంటుందన్న దానిపై క్లారిటీ లేదు. ఇటీవల ఢిల్లీ, బీహార్‌కు సీఎం కేసీఆర్ వెళ్లారు. అక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీజేపీపై ఆప్‌ పోరాటం చేస్తోంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ పార్టీకి సపోర్ట్ ఇస్తుందా అన్నది స్పష్టత లేదు. ఇటు బీహార్‌ సీఎం నితిష్‌కుమార్‌తో మంతనాలు జరిపారు. ఇటీవల ఎన్డీఏ నుంచి నితిష్‌ బయటకు వచ్చారు. అక్కడి విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితిష్‌ కూటమిలోని పార్టీలన్నీ యూపీఏకు దగ్గరగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also read:Gyanvapi Case Verdict:  జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం..విచారించేందుకు కోర్టు పచ్చజెండా..!

Also read:Kishan Reddy: జాతీయ పార్టీ స్థాపన అనేది అతి పెద్ద జోక్..8వ నిజాం కేసీఆర్: కిషన్‌రెడ్డి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News