ఒకే ఒక్కరితో కలిసి కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం

కేసీఆర్ తో పాటు ఎంత మందికి కేబినెట్ లో చోటు దక్కించుకుంటారనే దానిపై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. 

Last Updated : Dec 13, 2018, 01:57 PM IST
ఒకే ఒక్కరితో కలిసి కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: అనుకున్న ముహుర్తానికి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా మధ్నాహ్నం 1:25కి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.  రాజ్యంగపై ప్రమాణం చేసిన కేసీఆర్.. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. తాజా ఘట్టంతో రెండోస్సారీ కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినట్లయింది. 2014లో ఘన విజయం సాధించిన ఆయన తొలి సారి తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కాగా తాజాగా జరిగిన ఎన్నికల్లో అద్బుత మెజర్టీ సొంత చేసుకొని కేసీఆర్ మళ్లీ ఈ రోజు తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 

కుటుంబ సభ్యులే స్పెషల్ ఎట్రాక్షన్

రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవకార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్ నేతలు , పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరిసింహన్ దంపతులతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం గమనార్హం.

కేసీఆర్ తో పాటు ఒకే ఒక్కరు..

కేసీఆర్ తో పాటు ఎంత మంది కేబినెట్ లో చోటు దక్కించుకుంటారనే దానిపై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఒకే ఒక్కరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. గతంతో డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన మైనార్టీ నేత మహమూద్ అలీ ఒక్కరే కేసీఆర్ తో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సారి కూడా ఆయన్ను డిప్యూటీ సీఎంగా కొనసాగించే అకాశముుంది. మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో కేసీఆర్ తన కేబినెట్ కు రూపం ఇవ్వనున్నట్లు టాక్..దీంతో కేసీఆర్ కేబినెట్ లో ఎవరెవరికీ చోటు దక్కుతుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది.

Trending News