KCR NATIONAL POLITICS: దసరాకు కొత్త పార్టీ లేనట్టే! జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ జీరోనేనా?

KCR NATIONAL POLITICS:  దేశ్ కీ నేత కేసీఆర్.. ఇది కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు చేస్తున్న నినాదం. తెలంగాణలో ఈ వాయిస్ వినిపించడమే కాదు ఢిల్లీ, ముంబైలోనే దేశ్ కీ నేత కేసీఆర్ బ్యానర్లు వెలిశాయి.

Written by - Srisailam | Last Updated : Sep 27, 2022, 04:30 PM IST
  • కేసీఆర్ కొత్త పార్టీపై సస్పెన్స్
  • దసరాకి ప్రకటన లేనట్టే
  • ఢిల్లీ పరిణామాలతో కేసీఆర్ షాక్
KCR NATIONAL POLITICS: దసరాకు కొత్త పార్టీ లేనట్టే! జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ జీరోనేనా?

KCR NATIONAL POLITICS:  దేశ్ కీ నేత కేసీఆర్.. ఇది కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు చేస్తున్న నినాదం. తెలంగాణలో ఈ వాయిస్ వినిపించడమే కాదు ఢిల్లీ, ముంబైలోనే దేశ్ కీ నేత కేసీఆర్ బ్యానర్లు వెలిశాయి. కొంత కాలంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్ ను.. ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నారు గులాబీ నేతలు. జాతీయ రాజకీయాల్లో భాగంగా కేసీఆర్ కొత్త పార్టీ పెట్టనున్నారనే ప్రచారం సాగింది. దసరాకి పార్టీ ప్రకటన ఉంటుందని టీఆర్ఎస్ వర్గాల నుంచే లీకులు వచ్చాయి. భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్ ) పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందనే వార్తలు వచ్చాయి.

ఇటీవలే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. కేసీఆర్ తో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ లాంటి నేత అవసరం ఎంతో ఉందన్నారు. కేసీఆర్ కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు. అంతేకాదు దసరాకు కొత్త పార్టీ ప్రకటన ఉంటుందనే సంకేతం ఇచ్చారు. దీంతో విజయదశమికి జాతీయ స్థాయిలో పార్టీకి సంబంధించి సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని అంతా భావించారు. కాని తర్వాత జాతీయ పార్టీ వాదనే రావడం లేదు. దసరా పండుగ సమీపిస్తున్నా టీఆర్ఎస్ వర్గాల్లో జాతీయ పార్టీపై ఎలాంటి చర్చ సాగడం లేదు. గత నెలలో వరుస సమావేశాలతో హడావుడి చేసిన కేసీఆర్ కూడా సైలెంట్ అయిపోయారు. దీంతో దసరాకు కేసీఆర్ చెప్పిన కొత్త పార్టీ ప్రకటన ఉండకపోవచ్చని తెలుస్తోంది.

 బీజేపీ ముక్త భారత్ నినాదంతో జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటనలు చేశారు కేసీఆర్. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు చేశారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి  ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలో చర్చలు జరిపారు. బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్,  జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో మంతనాలు సాగించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే ఉన్న సమయంలో ముంబై వెళ్లి చర్చలు జరిపారు. మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధినేత దేవేగౌడతోనూ పలు సార్లు చర్చలు జరిపారు. కమ్యూనిస్టు పార్టీల జాతీయ నేతలతోనూ ప్రగతి భవన్ లో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు సాగించారు. నిజామాబాద్ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో జాతీయ పార్టీపై ప్రకటన చేయడమే కాదు.. దేశ వ్యాప్తంగా ఉచిత కరెంట్ ఇస్తామనే హామీ కూడా ఇచ్చారు. జాతీయ రాజకీయాలపై దూకుడుగా వెళ్లిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారన్నది చర్చగా మారింది. దేశ రాజకీయాలకు సంబంధించి కొన్ని రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు కేసీఆర్ ప్రయత్నాలకు చెక్ పెట్టాయనే ప్రచారం సాగుతోంది.

కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కలిశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి దాదాపు మూడేళ్ల తర్వాత సోనియాను కలిసిన నితీష్.. జాతీయ రాజకీయాలపైనే చర్చించారు. సోనియాతో భేటీ తర్వాత మాట్లాడిన నితిష్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య పోటీ ఉంటుందని చెప్పారు.  ధర్డ్ ఫ్రంట్, ఫస్ట్ ఫ్రంట్ అనేవి ఉండవని తేల్చి చెప్పారు. తాను కాంగ్రెస్ కూటమిలోనే ఉంటానని నితీష్ క్లారిటీ ఇచ్చారు.  హర్యానాలో ఇండియన్ లోక్ దళ్ అధినేత ఓం ప్రకాష్ చౌతాలా నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశానికి నితీష్ కుమార్ తో పాటు  ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ  అధినేత శరద్ పవార్,  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని  కలుపుకుని ముందుకు వెళ్తామని ఈసభలో  నేతలు సంకేతం ఇచ్చారు. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఈ సమావేశానికి హాజరుకానున్నా.. విపక్షాల కూటమిలో ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. కేసీఆర్ తో మంతనాలు సాగించిన పార్టీల అధినేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలో ఉంటామని చెప్పడంతో కొత్త పార్టీ డైలమాలో పడిందని అంటున్నారు.

Read also: Jr Ntr:  కమ్మోళ్లకు జూనియర్ ఎన్టీఆర్ దూరమయ్యారా? మామకు టికెట్ ఇవ్వలేదనే టీడీపీపై కోపమా?  

Read also: SBI Jobs: బ్యాంక్ అభ్యర్థులకు అలర్ట్..వెంటనే ఎస్‌బీఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News