రెవెన్యూ శాఖలో కీలక మార్పులని చేయాలని భావిస్తున్న తెలంగాణ కేసీఆర్..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ రద్దుకు సంబంధించి సీనియర్ నేతలు, మేధావుల అభిప్రాయాలను కేసీఆర్ సేకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవస్థలో చాలా లోపాలున్నాయని... వాటి స్థానంలో కొత్త చట్టం తీసుకురావడం మంచిదని పలువురు సూచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని సీఎం కేసీఆర్ పేర్కొనడం గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ మార్పులు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి