KT Rama Rao: తెలంగాణలో అధికారులు పేదల ఇళ్లను కూల్చివేస్తుండడం సర్వత్రా ఆగ్రహం తెప్పిస్తోంది. సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి బుల్డోజర్లతో దూసుకొచ్చి ఇళ్లను కూల్చివేస్తుండడంతో పేద ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. రాత్రికి రాత్రే తమ ఇళ్లు కూల్చివేస్తుండడంతో వారంతా రోడ్డు మీద పడుతున్నారు. హైడ్రా పేరిట హైదరాబాద్‌లో కూల్చివేతలు కొనసాగుతుండగా.. అదే విధానంలో జిల్లాలో కూడా అధికారులు రెచ్చిపోతున్నారు. మహబూబ్‌నగర్‌లో దివ్యాంగులు.. పేదలు నివసిస్తున్న ఇళ్లను కూల్చివేయడం అందరినీ కలచివేస్తోంది. ఈ కూల్చివేతలపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Corruption: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లో లంచావతారం? ఇది నిజమేనా?
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. పాలమూరు కూల్చివేతలపై ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా పాలమూరు కూల్చివేతలపై మల్లికార్జున ఖర్గేను ప్రశ్నించారు. తెలంగాణలో మీ పార్టీ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రజలను నడిరోడ్డు మీద పడడంపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. బుల్డోజర్ రాజ్‌గా మారకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Eggs Attack: కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యం.. ఎమ్మెల్యే కాలె యాదయ్యపై కోడిగుడ్ల దాడి
'దయచేసి తెలంగాణను మరో బుల్‌డోజర్ రాజ్‌గా మారకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వండి. మీరు చెప్పినట్లు.. ఒకరి ఇంటిని కూల్చివేసి.. వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయం. మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చివేశారు. 75 కుటుంబాల్లో దాదాపు 25 కుటుంబాలు దివ్యాంగులకు చెందినవి. తెలంగాణలో చట్టం, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం జరుగుతున్నది' అని మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్ తెలిపారు. 'అక్రమంగా కూల్చివేసిన నిరుపేదల్లో 25 కుటుంబాలు శారీరక దివ్యాంగులు ఉన్నారు. ఆమోద యోగ్యమైన పద్ధతులు పాటించకుండా.. విధివిధానాలు లేకుండా అమలు చేసే చట్టం చట్టమే కాదు. అడ్డగోలుగా నిరుపేదల పైకి బుల్డోజర్ నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి.. తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యాంగా మార్చకుండా ఆదేశాలు ఇవ్వాలి' అని ఖర్గేను కేటీఆర్ కోరారు.
అంధులు, కాళ్లు లేని వారివి కూల్చివేత
మహబూబ్‌నగర్‌లోని క్రిస్టియన్‌పల్లిలో మున్సిపల్ అధికారులు అర్దరాత్రి ఇళ్లను కూల్చివేయడాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అంధులు, కాళ్లు లేని దివ్యాంగులకు సంబంధించిన ఇళ్లను కూల్చివేశారు. చిన్న చిన్న రేకులు, తడకలతో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వారిపై పోలీస్ బందోబస్తుతో బుల్డోజర్లకు కూల్చివేయడం దారుణం. కనికరం లేకుండా గుడిసెలను కూల్చివేయడం సరికాదు. ఇళ్లు కోల్పోయిన దివ్యాంగులకు దిక్కెవరు' అని మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter