Weather Live Updates in Telugu: నైరుతీ బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మే 24వ తేదీని నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 23వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర వర్షం పడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షానికి సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.