Singareni Colony Girl Incident : సైదాబాద్ సింగరేణి కాలనీ బాధిత చిన్నారి కుటుంబ సభ్యులకు మంచు మనోజ్‌ పరామర్శ, నిందితుడ్ని వదలకూడదని డిమాండ్

Manchu Manoj :  నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడానికి  ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మనోజ్‌ సూచించారు. ఈ దారుణం జరిగి దాదాపు వారం రోజులు అవుతున్నా.. నిందితుడి ఆచూకీ తెలియట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2021, 05:18 PM IST
  • బాలిక హత్యాచారం కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి
  • 24 గంటల్లో పట్టుకొని కఠినంగా శిక్షించాలి
  • ఘటనను ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని మంచు మనోజ్‌ డిమాండ్
Singareni Colony Girl Incident : సైదాబాద్ సింగరేణి కాలనీ బాధిత చిన్నారి కుటుంబ సభ్యులకు మంచు మనోజ్‌ పరామర్శ, నిందితుడ్ని వదలకూడదని డిమాండ్

Manchu Manoj Reacts On Singareni Colony Girl Incident : హైదరాబాద్‌: సైదాబాద్‌లో జరిగిన బాలిక హత్యాచారం కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు సినీనటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj). బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడానికి  ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మనోజ్‌ సూచించారు. ఈ దారుణం జరిగి దాదాపు వారం రోజులు అవుతున్నా.. నిందితుడి ఆచూకీ తెలియట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చిన్నారి విషయంలో జరిగింది అత్యంత క్రూరమైన చర్య అన్నారు. బాలికపై జరిగిన ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని పిలుపు నిచ్చారు. ఆడపిల్లలను గౌరవించే విషయంపై ఎప్పటికప్పుడూ అవగాహన కల్పిస్తూనే ఉండాలన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం, పోలీసులు (Police) సీరియస్‌గా తీసుకోవాలని మనోజ్‌ కోరారు. 

Also Read : Covid19 Alert: చిన్నారుల్లో పెరుగుతున్న కరోనా కేసులు, ఆందోళన కల్గించే పరిణామమే

24 గంటల్లో పట్టుకొని కఠినంగా శిక్షించాలి

ఛత్తీస్‌గడ్‌లో (chhattisgarh) మూడేళ్ళ క్రితం ఒక చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ఉరిశిక్ష వేయాలంటూ ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చిందన్నారు. సైదాబాద్ (Cydabad) ఘటనకు కారణమైన నిందితుడి విషయంలో అంత సమయం జాప్యం చేయకూడదని, 24 గంటల్లో పట్టుకొని కఠినంగా శిక్షించాలని మంచు మనోజ్ (Manoj) డిమాండ్‌ చేశారు. బాధిత  కుటుంబానికి అన్ని రకాలుగా తోడుంటామని భరోసా ఇచ్చారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News