TRS MLAs Poaching case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితుల్లో ఒకరైన నంద కుమార్ అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. పలువురితో నందు కుమార్ సాగించిన ఆర్థిక లావాదేవీలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆరా తీస్తోంది. కొంతమందికి నందు ఇచ్చిన చెక్స్ బౌన్స్ అయినట్టు సిట్ గుర్తించింది. నందుపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది బాధితులు కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నట్టు సమాచారం.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అంశానికి సంబందించి తనకు అసలు ఎలాంటి సమాచారం తెలియదని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. తాము ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు శ్రీనివాస్‌ను ఆదేశించారు.
TRS MLA poaching case; సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై విచారణ జరిగింది. ఈ కేసు సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవడం సరికాదన్నారు.
TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారంలో విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది.
Hyderabad: తెలంగాణ రాజకీయాలను ఎమ్మెల్యేల బేరసారాల అంశం షేక్ చేస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అధికార పార్టీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ అని అంటూ మండిపడ్డారు. ఆ పార్టీ కట్టుకథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి స్పీచ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి.
MLA Pilot Rohit Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో నగదు ఆఫర్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. ఎఫ్ఐఆర్లో కీలక అంశాలను వెల్లడించారు.
BJP Deal With TRS MLAs: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భారతీయ జనతా పార్టీ కుట్రకు తెరలేపిందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ఆరోపించారు.
BJP Deal With TRS MLAs: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్థన్ రెడ్డి, రేగ కాంతారావులను బీజేపి కొనుగోలు చేయాలని కుట్ర పన్నిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Deal To Buy TRS MLAs: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ నుంచి ఓ ముఠా రంగంలోకి దిగిందని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఈ డీల్‌కి పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
TRS MLAs complaint on YS Sharmila: సీఎం కేసీఆర్, మంత్రులపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. శాసన సభ్యుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
Ponguleti Srinivas Reddy Political Plans: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ పేరు తెలుగురాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి అప్పట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ.. ఆ ఇబ్బందులను అధిగమించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్న సత్తా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంతం.
Telangana Politics : మహారాష్ట్రలో కొన్ని రోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపాయి. ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ జరిగింది.ఇటీవల కాలంలో తెలంగాణపై ఫోకస్ చేసింది బీజేపీ. దీంతో తెలంగాణలోనూ మహారాష్ట్ర తరహా పరిణామాలు జరుగుతాయా అన్న చర్చ మొదలైంది
Prashanth Kishor: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రజా క్షేత్రంలో తిరుగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే చర్చ సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కార్యక్రమాలతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.