Revanth Reddy Slams KCR : బీసీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే.. ఆ పదవిని బీసీకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారో ఆలోచించండన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 115 సీట్లలో ఒక్క ముదిరాజ్ కు కూడా టికెట్ ఇవ్వలేదు. ముదిరాజులపై కేసీఆర్ పగబట్టారు. 50 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు... అరశాతం ఉన్న కేసీఆర్ వర్గానికి 4 మంత్రి పదవులా? ఇచ్చారని ఆయన విమర్శించారు.
MLC Patnam Mahender Reddy takes oath as minister: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్నం మహేందర్ రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈటల రాజేందర్ ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి పార్టీలోంచి బయటకి పంపించేసిన తరువాత అప్పటి వరకు ఈటల రాజేందర్ నిర్వర్తించిన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను మంత్రి హరీశ్ రావుకి అప్పగించిన విషయం తెలిసిందే.
Mla Pilot Rohit Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ విచారణకు రావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి గతంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈడీ విచారణ ను నిలిపివేయాలంటూ.. హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు రోహిత్ రెడ్డి.
BJP MLA Raghunandan Rao Comments On Pilot Rohit Reddy: అయ్యప్పమాలలో ఉండి రోహిత్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, అలాగే రోహిత్ రెడ్డి మీద ఆయన సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారంలో విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది.
YS Sharmila Challenge to KTR: టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ విఫలయత్నం చేసిందని టీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలపై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన స్టైలులో ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కి కౌంటర్ ట్వీట్ చేసిన షర్మిల.. ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు.
BJP Deal With TRS MLAs: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భారతీయ జనతా పార్టీ కుట్రకు తెరలేపిందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ఆరోపించారు.
Deal To Buy TRS MLAs: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ నుంచి ఓ ముఠా రంగంలోకి దిగిందని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఈ డీల్‌కి పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు పార్టీపై పట్టు తప్పుతుందా? పార్టీ నాయకులు ఆయనను పట్టించుకోవడం లేదా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో నిజమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో వరుసుగా వెలుగు చూస్తున్న ఘటనకు ఇందుకు ఉదహరణగా నిలుస్తున్నాయి. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెఢ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి మధ్య తాజాగా వెలుగుచూసిన వివాదం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేకు సపోర్టే చేస్తున్నాడంటూ సీఐని పట్నం బండ బూతులు తిట్టడం వైరల్ గా మారింది. అధికార పార్టీలో కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.