Errabelli Dayakar Rao Slams Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ నేడు చేపట్టిన రైతు సంఘర్షణ సభపై రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాహుల్ గాంధీకి పలు సూటి ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తాం అని చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రుణ మాఫీ చేశారా అని ప్రశ్నించారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడుతున్న మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా పథకాలు ఎందుకు ఇవ్వలేదని రాహుల్ గాంధీని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పతాకాన్ని వ్యవసాయానికి ఎందుకు అనుసంధానం చేయలేదని అడిగారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదో చెప్పాలన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ చెప్పే బోగస్ మాటలను రైతులు నమ్మేందుకు సిద్ధంగా లేరని.. అంతేకాకుండా మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ధాన్యం కొనకపోవడం వల్లే అక్కడి రైతులు తెలంగాణకు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తంచేశారు.
ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చెరుకు పరిశ్రమలు మూసేసింది కదా అని గుర్తుచేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. పోడు భూముల సమస్య తలెత్తింది కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలోనే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ని రద్దు చేసి కొత్త రెవిన్యూ వ్యవస్థను తీసుకొస్తాం అని రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన విమర్శలు, ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రి ఎర్రబెల్లి.. ధరణి ఒక సక్సెస్‌ఫుల్ ప్రోగ్రాం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సభ రైతు సంఘర్షణ సభ కాదని.. ఇదొక రైతులను మోసం చేసే బోగస్ సభ అని మంత్రి ఎర్రబెల్లి అభివర్ణించారు.
టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదన్న ప్రకటనపై మంత్రి ఎర్రబెల్లి స్పందన..
రైతులను తప్పుడు హామీలతో మోసం చేస్తోన్న మీతో పొత్తు పెట్టుకోవడానికి ఇక్కడెవ్వరూ సిద్ధంగా లేరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయన్న ఆయన.. మీరు వచ్చి కాళ్లు పట్టుకున్నా మిమ్మల్ని నమ్మేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని... కేవలం స్వాతంత్య్రం తెచ్చిన కుటుంబమనే ఉద్దేశంతోనే ప్రజలు గతంలో మీకు పాలించే స్వేచ్ఛ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అలా కాదని.. తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్య్రం తెచ్చి పెట్టిన మహానుబావుడు తమ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు.
Also read : Nagaraju's Wife Ashreen Reaction: నాగరాజు పరువు హత్య, అశ్రీన్ ప్రశ్నలకు బదులేదీ..?
Also read : Rahul Gandhi:కేసీఆర్ తో టచ్ లో ఉంటే సస్పెండ్.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్
Also read : Revanth Vs Kavitha: రాహుల్ పర్యటనకు ముందు ట్విట్టర్ లో కవిత, రేవంత్ మధ్య డైలాగ్ వార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.