Medical Colleges In Telangana: ఒకే రోజున 9 మెడికల్ కాలేజీల ప్రారంభం.. ఎప్పుడంటే..

Medical Colleges In Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తోందని.. ఈ నెల 15వ తేదీన 9 మెడికల్ కాలేజీలను ఏకకాలంలో ప్రారంభించి చరిత్ర సృష్టించనున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.

Written by - Pavan | Last Updated : Sep 9, 2023, 06:28 AM IST
Medical Colleges In Telangana: ఒకే రోజున 9 మెడికల్ కాలేజీల ప్రారంభం.. ఎప్పుడంటే..

Medical Colleges In Telangana: 15వ తేదీన ఏకకాలంలో 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 15వ తేదీన జరిగే మెడికల్ కాలేజీ ల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని ఆదేశించారు. 20,000 మందికి తగ్గకుండా ర్యాలీ నిర్వహించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. దేశంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పేరు తెచ్చుకోనుందన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ జమానాలో తెలంగాణకు దక్కింది కేవలం రెండు మెడికల్ కాలేజీలు మాత్రమేనన్న కేటీఆర్.. 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని కేంద్రంపై మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తోందని.. ఈ నెల 15వ తేదీన 9 మెడికల్ కాలేజీలను ఏకకాలంలో ప్రారంభించి చరిత్ర సృష్టించనున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, అసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో నూతన మెడికల్ కాలేజీలను ఈనెల 15వ తేదీన ప్రారంభించుకోబోతున్నట్టు మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టంచేశారు.

ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న 9 జిల్లాల్లో మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నేతలకు మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీచేశారు. కేంద్రాల్లో కనీసం 15 నుంచి 20 వేల మందికి తగ్గకుండా భారీ ర్యాలీలను చేపట్టాలన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఒక మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కామారెడ్డిలో పాల్గొననున్నారు. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా ఆ జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలకు, జిల్లా ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఆయా జిల్లాల పరిధిలో ఉన్న శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు 15వ తేదీన జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి అని మంత్రి కేటీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.

మెడికల్ కాలేజీ ప్రారంభం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లో రిజిస్టర్ అయ్యేవిధంగా ఈ కార్యక్రమంలో భారీగా పెద్ద ఎత్తున యువతను, విద్యార్థులను భాగస్వాములను చేయాలి. మెడికల్ కాలేజీ ఏర్పాటు వలన కేవలం విద్యార్థులకే ప్రయోజనం కాకుండా దానికి అనుబంధంగా ఉండే హాస్పిటల్ వలన ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బిజెపిల వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలి. రెండు జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి అని పార్టీ శ్రేణులకు స్పష్టంచేశారు.

Trending News