GHMC Elections: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితా

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో హైదరాబాద్‌‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అభ్యర్థుల జాబితాను ప్రకటించి వారి చేత నామినేషన్స్ దాఖలు చేయించిన ఆయా రాజకీయ పార్టీల పెద్దలు.. తాజాగా ప్రచారంపై దృష్టిసారించారు.

Last Updated : Nov 21, 2020, 01:11 PM IST
GHMC Elections: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితా

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో హైదరాబాద్‌‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అభ్యర్థుల జాబితాను ప్రకటించి వారి చేత నామినేషన్స్ దాఖలు చేయించిన ఆయా రాజకీయ పార్టీల పెద్దలు.. తాజాగా ప్రచారంపై దృష్టిసారించారు. గ్రేటర్ పరిధిలో అన్ని వార్డులను కవర్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పార్టీలు.. తమ పార్టీల తరపున ప్రచారంలోకి దిగనున్న స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ పార్టీ సైతం 10 మంది పేర్లతో స్టార్ క్యాంపెయినర్స్ లిస్టును విడుదల చేసింది.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌‌ రెడ్డి ( Uttam kumar Reddy ) , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ), సీఎల్పీ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కతోపాటు మాజీ ఎంపీలు మహ్మద్ అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, వి.హనుమంత రావు, అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్స్ ( star campainers ) నగరవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.

Also read : GHMC Elections: కాంగ్రెస్ పార్టీ నుంచి మరో జాబితా విడుదల

Also read : TRS MP D Srinivas: ఎక్కడి అభివృద్ధి.. ఏం అభివృద్ధి..: సీఎం కేసీఆర్‌పై సొంత పార్టీ ఎంపీ డిఎస్ ఘాటు వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News