Mla Adi Srinivas On Allu Arjun: 15 ఏండ్ల క్రితమే చెన్నమనేని రమేష్ బాబు దేశ పౌరుడు కాదని నేను చెప్పిందే నిజమైందన్నారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. గత 15 ఏండ్లుగా తనతో పాటు నడిచి అండగా నిలిచిన శ్రేయోభిలాషులకు, నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మీడియా సమావేశంలో భాగంగా ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆయన చేసిన ధర్మ పోరాటంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి కేసు నమోదు కాలేదని అన్నారు. ఎట్టకేలకు విజయం సాధించడంతో న్యాయం గెలించిదన్నారు.
మాజీ ఎమ్మేల్యే రమేష్ బాబుది లా మేకర్ చరిత్ర కాదని..లా బ్రేకర్ చరిత్రని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇంత జరిగినా తీర్పు హేతుబద్దంగా లేదని రమేష్ బాబు అనడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పడికీ ముమ్మాటికి భారతదేశ పౌరుడిని అని.. తండ్రి చాటు బిడ్డగా ప్రజలను రమేష్ బాబు మోసం చేస్తున్నారు. ఇప్పటికే 45 సార్లు రమేష్ బాబు జర్మనీ పౌరుడని నిరూపించారని.. అయినప్పటికీ ఇంకా ఆయనకు బుకాయింపు ఎందుకని.. భారతదేశాన్ని మోసం చేయడం మంచిది కాదన్నారు. నేను చేసిన పోరాటం వల్ల 2013లో రమేష్ బాబు భారతదేశ పౌరసత్వం తీసుకున్నాడని.. ఏనాడు పౌరసత్వం తీసుకున్నాడో ఆనాడే నేను నైతికంగా గెలిచానని అన్నారు.
రమేష్ బాబు జర్మనీని ప్రేమిస్తూ.. భారతదేశాన్ని, నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నాడని, 2013 నుంచి 2023 వరకు ఆయన ఓసీఐ కార్డు కలిగి ఉన్న మాట నిజం కదా అని ప్రశ్నించారు. 2019లో మళ్లీ ఒకసారి జర్మనీలోని బెర్లిన్ లో ఓసిఐ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడని ఇక్కడ ఎమ్మెల్యే అని చెబుతూ ..అక్కడ ప్రొఫెసర్ అని చెప్పుకుని నాలుగు సార్లు నియోజకవర్గ ప్రజలను మోసం చేసి అడ్డంగా దొరికిపోయాడని అన్నారు.
రమేష్ బాబు తీరుతో ఆయన వంశానికి, ఆయన తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకువచ్చాడని, నేను రోల్ మోడల్ ఛాంపియన్ అని చెప్పుకున్న రమేష్ బాబు చేసింది తప్పని త్రీ మెన్ కమిటీ కూడా నిర్ధారించిందన్నారు. ఇప్పటికీ రమేష్ బాబు జర్మనీ పౌరుడైనని కేంద్ర హోంశాఖ మూడుసార్లు చెప్పిందన్నారు. గత 15 ఏళ్లుగా తనకు అన్యాయం జరిగిందని.. కోర్టు చెప్పిన మాట నిజం కాదా? తండ్రి చాటు బిడ్డగా నియోజవర్గ ప్రజలను మోసం చేసి గెలిచిన వ్యక్తి రమేష్ బాబు అని మండిపడ్డారు.
అదే 2009లో కేవలం 1800 ఓట్ల తేడాతో ఓడిపోయిన నేను.. ఆనాడే గెలిచుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదో నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలని.. నేను గెలిచిన, ఓడిన నియోజకవర్గ ప్రజల కష్టాల్లో పాలుపంచుకున్న మాట నిజం కాదా అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు స్వార్థం వల్ల నియోజకవర్గ ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో చూసామన్నారు. కానీ ఈ సారి ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాను ఇప్పటికే 750 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానని, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో కలికోట సూరమ్మ చెరువు, మర్రిపల్లి రిజర్వాయర్ పనులు మొదలైయాయన్నారు. 15 ఏండ్ల న సుదీర్ఘ పోరాటంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. అనంతరం విలేకరులు హీరో అల్లుఅర్జున్ అరెస్టు గురించి అడగగా.. ఆ విషయం నేను మాట్లాడలేనని అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.