మొబైల్ ఫోన్ కాల్స్, డేటా రేట్లు తగ్గడం వెనుక సీక్రెట్ అదే: మోదీ

ఈరోజుల్లో ఎక్కడైనా మిస్‌డ్ కాల్స్‌తో అవసరం పడుతుందా ? ఓటర్లను ప్రశ్నించిన మోదీ

Last Updated : Dec 3, 2018, 09:09 PM IST
మొబైల్ ఫోన్ కాల్స్, డేటా రేట్లు తగ్గడం వెనుక సీక్రెట్ అదే: మోదీ

హైదరాబాద్: గతంలో మొబైల్ ఫోన్ ఆపరేటర్లు వినియోగదారుల వద్ద కాల్స్‌కి, ఇంటర్నెట్ డేటాకు భారీ మొత్తంలో ముక్కుపిండి వసూలు చేసి, ఆ తర్వాత ప్రభుత్వంలోని పెద్దలకు సమర్పించుకునే వారు. అందుకే అప్పట్లో మొబైల్ ఫోన్‌లో మాట్లాడాలంటే అదో పెద్ద ఖరీదైన వ్యవహారంగా ఉండేది. దూర ప్రాంతాల్లో ఉన్న వారితో మాట్లాడాలనుకుంటే, వారికి మిస్‌డ్ కాల్ ఇవ్వాల్సిన దుస్థితి ఉండేది. కానీ ఈరోజుల్లో మిస్‌డ్ కాల్స్‌తో ఎవరికైనా మిస్‌డ్ కాల్స్‌తో అవసరం పడుతుందా అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. తమ సర్కార్ అధికారంలోకొచ్చిన తర్వాత టెలికాం ఆపరేటర్ల దోపిడికి స్వస్తి పలికాం. అందువల్లే ఇప్పుడు సామాన్యులకు సైతం మొబైల్ ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ డేటా చౌక ధరలో అందుబాటులోకొచ్చాయని మోదీ స్పష్టంచేశారు. తెలంగాణలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన మోదీ ఎల్బీ స్టేడియంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మహా కూటమితోపాటు, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Trending News