Covid 19 : ఏడాదిన్నరగా మార్చురీలోనే-అత్యంత కుళ్లిపోయిన స్థితిలో కోవిడ్ బాధితుల మృతదేహాలు

Dead bodies rotting in Mortuary: ఆ ఇద్దరు కోవిడ్ పేషెంట్ల చనిపోయి ఏడాదిన్నర గడిచింది. అప్పట్లో కోవిడ్ వ్యాప్తి కారణంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. ఆ ఇద్దరినీ తామే దహనం చేసినట్లు మున్సిపల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కానీ తీరా 15 నెలల తర్వాత ఆ ఇద్దరి కుటుంబ సభ్యులకు షాకింగ్ న్యూస్ తెలిసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 09:27 AM IST
  • ఆసుపత్రి మార్చురీలో 15 నెలలుగా ఇద్దరు కోవిడ్ బాధితుల మృతదేహాలు
    అత్యంత కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలు
    బెంగళూరు ఈఎస్ఐ ఆసుపత్రిలో వెలుగుచూసిన ఘటన
Covid 19 : ఏడాదిన్నరగా మార్చురీలోనే-అత్యంత కుళ్లిపోయిన స్థితిలో కోవిడ్ బాధితుల మృతదేహాలు

Dead bodies rotting in Mortuary: ఏడాదిన్నర క్రితం కరోనా (Coronavirus) వ్యాప్తి పీక్ స్టేజీలో ఉన్న సమయంలో ఆ ఇద్దరికి కరోనా సోకింది. అప్పటికీ ఆసుపత్రుల్లో ఎక్కడా బెడ్స్ దొరకని పరిస్థితి. ఇద్దరి కుటుంబ సభ్యులు అన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగితే అతి కష్టం మీద బెడ్స్ దొరికాయి. కానీ ఆ తర్వాత కొద్దిరోజులకే ఆ ఇద్దరు కరోనాకు బలైపోయారు. ఆ ఇద్దరు కుటుంబ సభ్యులకు తమ వారిని చివరి చూపు చూసుకునే అవకాశం కూడా దక్కలేదు. మృతదేహాలను (Dead bodies) తామే దహనం చేశామని మున్సిపల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఇది జరిగిన దాదాపు ఏడాదిన్నరకు ఆ ఇద్దరు కుటుంబ సభ్యులకు ఆసుపత్రి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది చెప్పిన విషయం విని ఆ కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. 

పూర్తి వివరాలను పరిశీలిస్తే... బెంగళూరుకు (Bengaluru) చెందిన దుర్గా సుమిత్ర (40), మునిరాజు (50) అనే ఇద్దరు 15 నెలల క్రితం కరోనాతో చనిపోయారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో చేరిన 4 రోజులకు సుమిత్ర చనిపోగా... అదే ఆసుపత్రిలో చేరిన మునిరాజు అనే వ్యక్తి కూడా కొద్దిరోజులకే చనిపోయాడు. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందన్న కారణంతో మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. ఇద్దరి మృతదేహాలను తామే దహనం చేశామని బృహత్ బెంగళూరు మహానర పాలక సిబ్బంది(Bruhat Bengaluru Mahanagara Palike) వారికి సమాచారమిచ్చారు. 

ఇది జరిగి ఏడాదిన్నర గడిచాక... వారు చనిపోయిన ఈఎస్ఐ ఆసుపత్రి (ESI hospital) నుంచి ఇద్దరి కుటుంబ సభ్యులకు మరో ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఇద్దరి మృతదేహాలను దహనం చేయలేదని... 15 నెలలుగా ఆసుపత్రి మార్చురీలోనే అత్యంత కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని అక్కడి సిబ్బంది చెప్పారు. వెంటనే ఆసుపత్రి మార్చురీకి వెళ్లి చూడగా ఆ దృశ్యం చూసి తట్టుకోలేకపోయారు. అసలే చివరి చూపు కూడా చూసుకోలేదన్న బాధ... ఆఖరికి అంతిమ సంస్కారానికి (Last rites) కూడా నోచుకోలేదని తెలిసి ఆ కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. 

Also Read: Sanjay Raut Viral Dance: పెళ్లి వేడుకలో పార్లమెంట్ సభ్యులు సంజయ్ రౌత్, సుప్రియా డ్యాన్స్.. వీడియో వైరల్

ఈ ఘటనపై మృతురాలు దుర్గా సుమిత్రా సోదరి సుజాత మాట్లాడుతూ... 'సుమిత్ర కరోనా (Covid 19) బారినపడ్డ తర్వాత ఎక్కడా బెడ్ దొరకలేదు. చివరకు ఈఎస్ఐ ఆసుపత్రిలో చేర్చగా... 4 రోజులకే చనిపోయింది. కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చెప్పి ఆసుపత్రి సిబ్బంది మాకు మృతదేహాన్ని అప్పగించలేదు. ఆ తర్వాత బెంగళూరు (Bengaluru) మున్సిపల్ సిబ్బంది ఫోన్ చేశారు. మృతదేహాన్ని తామే దహనం చేశామని చెప్పారు. ఇదంతా జరిగిన 15 నెలల తర్వాత, 3 రోజుల క్రితం మరో ఫోన్ కాల్ వచ్చింది. మృతదేహం ఇంకా ఆసుపత్రి మార్చురీలోనే ఉందని... అత్యంత కుళ్లిపోయిన స్థితిలో పడి ఉందని ఈఎస్ఐ సిబ్బంది చెప్పారు. అది విని ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యాను.' అని వాపోయారు.

మునిరాజు కొడుకు సతీశ్ మాట్లాడుతూ... 'మా నాన్నను ఈఎస్ఐ ఆసుపత్రిలో చేర్చిన కొద్దిరోజులకు ఆయన చనిపోయినట్లు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని అప్పగించలేదు. బీబీఎంపీ సిబ్బంది తామే దహనం చేసినట్లు సమాచారమిచ్చారు. తీరా ఇప్పుడు ఫోన్ చేసి మృతదేహాన్ని దహనం చేయలేదని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు.' అని వాపోయాడు. ఈ ఘటనపై బీజేపీ (BJP) ఎమ్మెల్యే సురేశ్ కుమార్ కర్ణాటక (Karnataka) ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News