Shalini Kidnap: షాలిని కిడ్నాప్ కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్..అందరినీ టెన్షన్ పెట్టి చివరికి!

Twist in Shalini Kidnap Case:  ఈరోజు ఉదయం తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కిడ్నాప్ గు గురైన యువతి వ్యవహారంలో మరో ట్విస్ట్ తెర మీదకు వచ్చింది, ఇప్పుడు ఏకంగా తాను వివాహం చేసుకున్నానని ఆమె ప్రకటించింది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 20, 2022, 03:43 PM IST
Shalini Kidnap: షాలిని కిడ్నాప్ కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్..అందరినీ టెన్షన్ పెట్టి చివరికి!

New Twist in Shalini Kidnap Case: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక యువతి ఈ రోజు ఉదయం కిడ్నాప్ అయిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. కొద్దిరోజుల క్రితం హైదరాబాదులో వైశాలిని కిడ్నాప్ చేసినట్లుగానే ఈ కేసులో కూడా శాలిని అనే అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లుగా అందరూ భావించారు. అయితే ఈ వ్యవహారంలో తాజాగా ఒక ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఈ కిడ్నాప్ కదా సుఖాంతం అయినట్లు తెలుస్తోంది.

అసలు విషయం ఏమిటంటే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ శాలిని ఒక వీడియో రిలీజ్ చేసింది. తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి తాను ప్రేమించిన వ్యక్తి అని మాస్క్ ధరించడం వల్ల అతనిని గుర్తుపట్టలేకపోయానని ఆమె విడుదల చేసిన వీడియోలో పేర్కొంది. తాము నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని తనకు ఇంట్లో వేరే సంబంధాలు చూసి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతనికి సమాచారం ఇచ్చి తానే కిడ్నాప్ చేయించుకున్నానని ఆమె పేర్కొంది.

తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఇష్టపూర్వకంగానే జ్ఞానేశ్వర్ అలియాస్ జానీతో వెళ్లిపోయానని ఆమె క్లారిటీ ఇచ్చింది. అంతే కూడా వివాహం చేసుకున్న ఫోటోలు వీడియోలు కూడా మీడియాకు విడుదల చేశారు. నిజానికి గత ఏడాది జ్ఞానేశ్వర్ ని పెళ్లి చేసుకున్నానని అయితే అప్పటికి తాను మైనర్ కావడంతో తన పేరెంట్స్ అభ్యంతరం తెలిపి కేసులు పెట్టి అతని మీద ఫోక్సో యాక్ట్ కూడా నమోదు చేయించారని ఆమె పేర్కొంది.

ఇప్పుడు ఇద్దరమూ మేజర్లమే కాబట్టి పెళ్లి చేసుకున్నామని ఆమె పేర్కొంది. చందుర్తి మండలం మూడపల్లి అనే గ్రామానికి చెందిన శాలిని అనే యువతి ఉదయం తండ్రితో కలిసి హనుమాన్ టెంపుల్ కి వెళ్ళింది. గుడిలో పూజ చేసి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో నలుగురు యువకులు కిడ్నాప్ చేసినట్లు అక్కడ సీసీ కెమెరాలలో రికార్డు అయింది. గతంలో తమ కుమార్తెను ప్రేమ పేరుతో వేధించిన జానీ అనే వ్యక్తి ఇలా చేసి ఉండవచ్చు అని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.

వారి అనుమానమే నిజమైంది కానీ తమ కుమార్తె స్వయంగా అతనితో వెళ్ళిపోయి ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుందని తెలుసుకొని ఇప్పుడు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే రికార్డ్ అయిన సిసి టీవీ ఫుటేజ్ లో అమ్మాయి విడిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండడంతో అందరూ నిజంగానే ఆమె కిడ్నాప్ అయిందని భావించారు. కానీ అనూహ్యంగా ఆమె ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇచ్చింది, దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: Rangasthalam Auditions: ఆరోజు అనుపమ వాళ్ల అమ్మ అక్కడ లేకుంటే సమంత ప్లేస్ అనుపమదే..

Also Read: Vijay - Samantha : అమ్మాయిల డ్రీమ్ బాయ్, అబ్బాయిల డ్రీమ్ గర్ల్.. ఎప్పుడైనా ఈ విషయం గమనించారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News