గిఫ్ట్‌లు ఊరికే రావు...

తెలంగాణలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల నుంచి డబ్బు దోచుకునేందుకు రకరకాల కుయుక్తులు, కొత్త కొత్త ట్రిక్కులతో ముందుకు సాగుతున్నారు. వారి వలలో చిక్కుకున్న అమాయక జనం.. చివరకు మోసం జరిగిందని తెలుసుకున్న తర్వాత  లబోదిబోమంటున్నారు.

Last Updated : Feb 17, 2020, 02:26 PM IST
గిఫ్ట్‌లు ఊరికే రావు...

తెలంగాణలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల నుంచి డబ్బు దోచుకునేందుకు రకరకాల కుయుక్తులు, కొత్త కొత్త ట్రిక్కులతో ముందుకు సాగుతున్నారు. వారి వలలో చిక్కుకున్న అమాయక జనం.. చివరకు మోసం జరిగిందని తెలుసుకున్న తర్వాత  లబోదిబోమంటున్నారు. 

తెలంగాణలోని జిల్లాలు, హైదరాబాద్ లాంటి నగరాల్లో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. జనాన్ని నిలువు దోపిడీ చేసేందుకు కొత్త ట్రిక్కులతో దుండగులు వల పన్నుతున్నారు. మీకు లక్కీ లాటరీ తగిలిందని అమాయక జనాన్ని నమ్మిస్తారు. ముందుగా ఓ లేఖతో వల విసురుతారు. సోషల్ మీడియా సైట్స్, ఇతరత్రా మార్గాల ద్వారా మోసగాళ్లు. . అమాయక జనం చిరునామాలు తెలుసుకుంటున్నారు. వారికి కారు గిఫ్ట్ గా వచ్చిందని నమ్మబలికేందుకు ప్రయత్నిస్తున్నారు.

మీ కారు మీకు గిఫ్ట్ రూపంలో లభించాలంటే కింద ఉన్న నంబర్ కు ఫోన్ చేయాలని సూచిస్తారు. అమాయకులు ఫోన్ చేసిన తర్వాత .. వారిని తెలివిగా నమ్మించి .. అకౌంట్లలో డబ్బులు కట్టాలని .. లేదంటే గిఫ్ట్ వెనక్కి వెళ్లిపోతుందని తొందర పెడతారు. ఎప్పుడైతే హైరానా పడిపోయిన జనం.. వారి ఖాతాల్లో డబ్బులు వేసారో. . ఇక అంతే..

ఇలాంటి నేరగాళ్లపై జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి లెటర్లు వచ్చినప్పుడు పోలీసులకు తెలియజేయాలని చెబుతున్నారు. అమాయకంగా మోసపోవద్దని.. ఊరికే గిఫ్ట్‌లు రావు... అని చెబుతున్నారు. 

Trending News