Owaisi Vs KCR: కేసీఆర్ పై రెచ్చిపోయిన ఓవైసీ.. గులాబీ బాస్ తో దోస్తీ కటీఫ్ అంటున్న అసదుద్దీన్..

Owaisi Vs KCR: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శతృవులు ఉండరని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు ఒకరినొనకరు  తిట్టు కున్న రాజకీయ నేతలు.. రాజకీయ అవసరం ఏర్పడితే.. ఒకరినొకరు ఆలింగనాలు చేసుకున్న సందర్భాలు కోకోల్లలు. తాజాగా మొన్నటి వరకు కేసీఆర్ తో  చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఎంఐఎం ఛీఫ్..ఆ పార్టీ అధికారంలోంచి దిగగానే.. వెంటనే ప్లేటు మార్చి కేసీఆర్ పై రెచ్చిపోతున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 17, 2024, 12:09 PM IST
Owaisi Vs KCR: కేసీఆర్ పై రెచ్చిపోయిన ఓవైసీ.. గులాబీ బాస్ తో దోస్తీ కటీఫ్ అంటున్న అసదుద్దీన్..

Owaisi Vs KCR: నిన్న మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ తిప్పిన ఓవైసీ బ్రదర్స్.. ఆ పార్టీ అధికారంలోంచి దిగగానే.. పూర్తిగా మారిపోయిన చంద్రముఖిలా తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. అవును అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పూర్తి మారిపోయింది. ఇక అధికార బీఆర్ఎస్ తో అంటకాగిన ఎంఐఎం పార్టీ.. ఆ పార్టీ అధికారం కోల్పోగానే తన అసలు రంగు ఏంటో బట్టబయలు చేసింది. అవును తెలంగాణలో ఎన్నికల తర్వాత  ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ మధ్య దూరం పెరిగిందా? ఇక పూర్తిగా వారి మధ్య దోస్తీకి కటీఫ్‌ చెప్పనుందా ? ఇప్పుడే ఇదే రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా  చర్చ జరుగుతోంది.

ఇన్నాళ్లు బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచిన ఒవైసీ తాజాగా స్వరం మార్చారు.అంతేకాదు ఇపుడు బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా టార్గెట్ చేయడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు కేసీఆర్‌కు అండగా నిలిచిన అసద్ స్వరం మార్చడంతో ఆయన బీఆర్ఎస్‌తో దోస్తీకి గుడ్ బై చెప్పునున్నారా అనే  చర్చ జరుగుతోంది. నిజానికి గత ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్‌తో ఎంఐఎంకు చెడిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ విలీనంపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
భారతీయ జనతా పార్టీలోకి  బీఆర్ఎస్‌ను విలీనం చేస్తున్నారా..? లేదా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్‌ను అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. కాగా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు గులాబీ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆ పార్టీతో అంటి ముట్టనట్లుగా ఉంటోంది.  ఈ క్రమంలోనే బీజేపీ విలీనంపై ఆన్సర్ చెప్పాలని నేరుగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించడంతో.. కారు, కైట్ పార్టీలకు మధ్య ఫ్రెండ్ షిప్ బ్రేక్ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా  ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News