Telangana: సచివాలయంలో కారు చోరీ.. గాలింపు చర్యలు ముమ్మరం

పటిష్ట భద్రత ఉండే సచివాలయంలో కారు చోరీ (Car Theft from Secratariat) జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నెలన్నర గడిచినా ఇంకా నిందితుడు ఎవరన్నది పోలీసులు గుర్తించకపోవడం గమనార్హం. 

Last Updated : Aug 25, 2020, 09:36 AM IST
Telangana: సచివాలయంలో కారు చోరీ.. గాలింపు చర్యలు ముమ్మరం

హైదరాబాద్; పటిష్ట భద్రత ఉండే సచివాలయంలో కారు చోరీ (Car Theft from Secratariat) జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పంచాయతీరాజ్‌ విభాగానికి చెందిన కారును సచివాలయంలో పార్కింగ్ చేశారు. జులై 5న సచివాలయ భవనాల కూల్చివేత ప్రారంభం కావడంతో ఇక్కడ పార్క్ చేసిన కార్లను ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉన్న పార్కింగ్ ఏరియాకు తరలించారు. Breakfast మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..! 

స్కార్పియో కారు (ఏపీ 09 ఏఎస్‌ 2727) వాహనం కనిపించడం లేదని ఆ మరుసటి రోజు డ్రైవర్‌ కలీం ఉన్నతాధికారులకు తెలిపాడు. వారు సూచన మేరకు స్కార్పియో చోరీపై సైఫాబాద్‌ పోలీసులకు డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. స్కార్పియోను రెండు రోజుల్లో సుచిత్ర వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరు చోరీ చేశారు, అక్కడ ఎవరు పార్కింగ్ చేశారనే విషయంపై  కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. అయితే ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.  Gold Rate India: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు

Trending News