ప్రధాని మోడీ హైదరాబాద్ షెడ్యూల్

ప్రధాని నవంబర్ 28వ తేదీ హైదరాబాద్ కు రానున్నారు. ఆయన ఎక్కడెక్కడ ఏఏ కార్యాక్రమాలలో పాల్గొంటారో షెడ్యూల్ విడుదలైంది.

Last Updated : Nov 23, 2017, 01:42 PM IST
    • 28 మధ్యాహం 3 గంటలకు డిల్లీ నుండి రాక
    • 3:30 మియాపూర్ మెట్రో ప్రారంభం
    • సాయంత్రం అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభం
    • రాత్రి ఫలక్ నూమా ప్యాలెస్ లో విందు
    • రాత్రి 8:30కు ఢిల్లీ పయనం
ప్రధాని మోడీ హైదరాబాద్ షెడ్యూల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్న మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరుకానున్నారు. ప్రధాని ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో నవంబర్28 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. ఆయన్ను  గవర్నర్,  సీఎం, ఇతర ప్రముఖులు ఘనంగా ఆహ్వానిస్తారు.  రోడ్డు మార్గాన మియాపూర్ మెట్రో స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ మెట్రో ప్రారంభించి, కూకట్పల్లి స్టేషన్ వరకు ఐదు కోలోమీటర్లు మెట్రోలోనే ప్రయాణిస్తారు. మళ్లీ మెట్రోలోనే ప్రయాణించి మియాపూర్ కు వస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన ప్రాజెక్టుకు సంబంధించిన ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకిస్తారు.

మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో హెచ్ఐసీసీ చేరుకుంటారు. అక్కడ ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సును ఇవాంకా ట్రంప్ తో కలిసి ప్రారంభిస్తారు. రాత్రి ఏడు గంటలకు రోడ్డు మార్గాన ఫలక్ నూమా ప్యాలెస్ చేరుకొని విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆతరువాత రాత్రి 8:30కు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ చేరుకొని.. ప్రత్యేక విమానంలో ఢిల్లీ ప్రయాణమవుతారు. గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖులు ఆయనకు వీడ్కోలు పలుకుతారు. ప్రధాని హైదరాబాద్ కు రానున్నవేళ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Trending News