తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, కావాలంటే ఉదయం 6 గంటల నుంచి 10 వరకు అత్యవసర సరుకులు తీసుకుని వెళ్లాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పేదలకు పట్టెడన్నం పెట్టాలని వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
బేగంపేట వద్దకు చేరుకోగానే పోలీసులు రేవంత్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. పేద ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం అమానవీయంగా నడుచుకుంటుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. కరోనా కష్టకాలంలో ఎంపీగా బాధ్యతతో వ్యవహరించి పేదవారికి పట్టెడన్నం పెట్టాలని వెళ్తున్న తనను ఎందుకు ఆపారంటూ పోలీసులను ఎంపీ రేవంత్ రెడ్డి (Congress MP Revanth Reddy) ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో పేదలకు అన్నం పెట్టే అధికారాన్ని దూరం చేసే అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టెడన్నంపై సైతం రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు.
Also Read: COVID-19: దేశంలో మరోసారి 4 వేల కరోనా మరణాలు, పాజిటివ్ కన్నా డిశ్ఛార్జ్ కేసులు అధికం
The govt’s inhumanity reached its peak in trying to stop me from distributing food for the poor at Gandhi hospital & Sec’bad railway station, also from overseeing the progress of work at a hospital I adopted in Cantonment and turning into a covid facility. Cheap politics in play pic.twitter.com/Vs1Pv4owRZ
— Revanth Reddy (@revanth_anumula) May 16, 2021
తనను అడ్డుకోవాలని, పేదలకు అన్నం పెట్టకుండా ఉండాలని మిమ్మల్ని ఎవరు ఆదేశించారో చెప్పాలని పోలీసులను ఎంపీ అడిగారు. రేవంత్ రెడ్డికి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా ఆయన పోలీసుల మాట వినలేదు. తెలంగాణ(Telangana)లో లాక్‌డౌన్ అయితే మీరేందుకు రోడ్డుపైకి వచ్చారు. మీరు మీ బాధ్యతలు నిర్వర్తిస్తుంటే, తాను ఎంపీనని కరోనాతో బాధపడుతున్న పేదలకు అన్నం పెట్టడానికి బాధ్యతగా వెళ్తున్నానని చెప్పారు. పేదలకు పట్టెడన్నం పెట్టకుండా అడ్డుకుంటూ తెలంగాణ ప్రభుత్వం నీచరాజకీయాలు చేస్తుందంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook