Rains in Telangana: హైదరాబాద్: నగరంలో శుక్రవారం పలు చోట్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలు కనిపించినప్పటికీ.. సాయంత్రానికి ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షానికి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు తోడవడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎల్బీ నగర్, ఉప్పల్, దిల్షుక్ నగర్, మలక్ పేట, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, చందానగర్‌తో పాటు నగరంలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. అయితే, లాక్డౌన్ కారణంగా రోడ్లపై రద్దీ అంతగా లేకపోవడంతో ట్రాఫిక్ జామ్ వంటి ఇబ్బందులు పెద్దగా కనిపించలేదు.
Also read: Telangana COVID-19 updates: తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా కేసులు.. 29 మంది మృతి
ఇదిలావుంటే, తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ భారీ ఈదురుగాలులతో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన తమ పంట నష్టపోయామని పలువురు అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook