Pushpa 2 Case: పుష్ప 2 నిర్మాతలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్..

Pushpa 2 Case: డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో రేవతి అనే యువతి మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటనలో అల్లు అర్జున్ A11 గా చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు అరెస్ట్ చేసారు. వెంటనే మధ్యంతర బెయిల్ పై విడుదల చేసారు. తాజాగా ఈ ఘటనపై పుష్ప 2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 2, 2025, 02:45 PM IST
Pushpa 2 Case: పుష్ప 2 నిర్మాతలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్..

Pushpa 2 Case: సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్స్ సందర్బంగా అల్లు అర్జున్ తో పాటు చిత్ర నిర్మాతలైన యలమంచలి రవి శంకర్, నవీన్ యెర్నెనీ పై పోలీసులు కేసు నమోద చేసారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రొడ్యూసర్లు పుష్ప 2 ప్రొడ్యూసర్స్ కు హై కోర్టు లో ఊరట లభించింది. సంధ్య థియేటర్ ఘటనపై తమ మీద నమోదు చేసిన కేసు ను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. థియేటర్ కు సంబంధించిన భద్రత తమ పరిధిలోకి రాదని పిటిషన్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.

థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ కు తాము వచ్చే విషయాన్ని ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చాము. ముందే ఇన్ఫామ్ చేసాము కాబట్టే అంత మంది పోలీసులు అక్కడ ఉన్నారని నిర్మాతల తరుపున లాయర్ తన వాదనలు వినిపించారు. అంతేకాదు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నప్పటికీ దురుదుష్టవశాత్తు ఈ ఘటన జరిగింది.

జరిగిన ఘటనకు సినిమా నిర్మాతలను నిందితులుగా చేరిస్తే ఎలా అని పిటిషనర్ తరుపు న్యాయవాది ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రొడ్యూసర్లను అరెస్ట్ చేయవద్దని హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయలో  కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

పుష్ప 2 విషయానికొస్తే.. నిన్నటితో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నాలుగు వారాల రన్ పూర్తి చేసుకుంది. అంతేకాదు తెలంగాణ, ఏపీలో ఈ సినిమా రూ. 230 కోట్ల షేర్ (రూ. 350 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 825 కోట్ల షేర్ (రూ. 1717 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా బిజినెస్ పై దాదాపు రూ. 200 కోట్ల వరకు లాభాలను ఆర్జించింది.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News