Ramgopal varma: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో నోముల భగత్‌కు జై కొడుతున్న ఆర్జీవీ

Ramgopal varma: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. నచ్చిందంటే నిర్మొహమాటంగా చెప్పేస్తారు. నచ్చకపోయినా అంతే. ఇప్పుడాయన దృష్టి నాగార్జునసాగర్ ఉపఎన్నికపై పడింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 3, 2021, 04:28 PM IST
Ramgopal varma: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో నోముల భగత్‌కు జై కొడుతున్న ఆర్జీవీ

Ramgopal varma: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. నచ్చిందంటే నిర్మొహమాటంగా చెప్పేస్తారు. నచ్చకపోయినా అంతే. ఇప్పుడాయన దృష్టి నాగార్జునసాగర్ ఉపఎన్నికపై పడింది.

వివాదాస్పద సినిమాలు తీయడం లేదా సినిమాలో ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని జోడించి చర్చనీయాంశం కావడం ఆర్జీవీ (RGV) కు బాగా అలవాటు. అప్పుడప్పుడూ రాజకీయ, సామాజిక అంశాలపై నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నిక(Nagarjunasagar Bypoll)పై ఆయన దృష్టి పడింది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధిపై రామ్‌గోపాల్ వర్మ (Ramgopal varma) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనకు ఓటు హక్కుంటే సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కే ఓటేస్తానని ఆర్జీవీ తెలిపారు. ఈ మేరకు చిరుతపులితో నోముల భగత్ కలిసి నడుస్తున్న వీడియోను వర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

మరవైపు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్(KTR) ‌లను సింహంతో పోల్చారు. చిరుతపులిని వాకింగ్‌కు తీసుకెళ్తున్న నోముల భగత్ (Nomula Bhagath) అంటే తాను ఇష్టపడుతున్నట్టు ఆర్జీవీ తెలిపారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది.  రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న డి కంపెనీ వెబ్‌సిరీస్ ట్రైలర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

Also read: COVID-19 Positive Cases: తెలంగాణలో ఒక్కరోజే 965 కోవిడ్-19 పాజిటివ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News