తెలంగాణకి వస్తున్న 'రోబో పోలీస్'

భాగ్యనగరంలోని పౌరులకు రోబ్‌ పోలీస్‌ సేవలు అందించనుంది. 

Last Updated : Dec 29, 2017, 09:26 PM IST
తెలంగాణకి వస్తున్న 'రోబో పోలీస్'

భాగ్యనగరంలోని పౌరులకు రోబ్‌ పోలీస్‌ సేవలు అందించనుంది. నగరంలోని ఐటీ కారిడార్‌కు ముఖద్వారంగా ఉన్న జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టులో రోబో పోలీస్‌ ద్వారా ప్రయోగాత్మకంగా సేవలు అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. టీ-హబ్‌లో స్టార్టప్‌ కంపెనీ హెచ్‌ బోట్స్‌ రోబోటిక్స్‌ కంపెనీ ఈ పోలీస్‌ రోబోను రూపొందించింది.

ఈ స్టార్టప్ కంపెనీ ద్వారా హైదరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా 10 రోబోలను తయారు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ రోబో పోలీస్ ధర సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని హెచ్‌ బోట్స్‌ రోబోటిక్స్‌ ప్రతినిధులు తెలిపారు. జూలై 2017లో గచ్చిబౌలిలోని ‘హెచ్‌ బోట్స్‌’ స్టార్టప్ సంస్థను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. నగర పోలీసుల ఆధ్వర్యంలోనే ఈ రోబో పోలీస్ సేవలు అందించడం విశేషం. 

Trending News