Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. మరణించిన వారికి ఎక్స్‎గ్రేషియా!

PM Modi reacts on Secunderabad fire accident. సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 13, 2022, 10:34 AM IST
  • సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం
  • ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
  • మరణించిన వారికి ఎక్స్‎గ్రేషియా
Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. మరణించిన వారికి ఎక్స్‎గ్రేషియా!

PM Modi reacts on Secunderabad fire accident: సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. రూబీ ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ-బైకులు పేలి.. మంటలు, దట్టమైన పొగ వ్యాపించి అదే కాంప్లెక్స్‌లోని లాడ్జిలో వసతి పొందుతున్న ఎనమిది మంది పర్యాటకులు ఊపిరి ఆడక మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో పది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ ఘనలో మరణించిన వాళ్లకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ (ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) తరపున రూ. 2 లక్షల ఎక్స్‎గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా అగ్ని ప్రమాదంలో గాయపడిన వాళ్లకు రూ. 50వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ట్విటర్‌లో ఓ ట్వీట్‌ చేసింది.

సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మూడు లక్షల చొప్పున ఎక్స్‎గ్రేషియాను  తెలంగాణ ప్రభుత్వం తరఫున అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గాయపడిన వారిని ఆదుకుంటామని, మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు. 

Also Read: 'రెబల్ స్టార్' ప్రభాస్‌కు అరుదైన గౌరవం.. తొలి సౌతిండియా స్టార్‌గా..!

Also Read: Sanju Samson - Shami: బీసీసీఐ డ్రామాలాడుతోంది.. ట్రెండింగ్‌లో సంజూ, షమీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News