హైదరాబాద్ : బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని విజయవంతంగా చేపట్టి లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి సంస్థ తన చరిత్రలో మరో ఆరుదైన మైలురాయిని చేరుకుంది. సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ తన సత్తా చాటాలని, ఆ రంగంలోకి అడుగిడింది. సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 220 మెగావాట్ల సామర్ధ్యమున్న సోలార్ పవర్ ప్లాంటులో మొదటి ప్లాంటు(5 మెగావాట్లు) విద్యుత్‌ను 33 కె.వి. పవర్‌లైన్‌కు అనుసంధానం చేసి సోలార్ విద్యుత్ ఉత్పాదన రంగంలోకి ప్రవేశించింది.
దీంతో దేశంలోనే థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పాదక రంగంలోకి ప్రవేశించిన తొలి బొగ్గు కంపెనీగా సింగరేణి సరికొత్త సాంప్రదాయాన్ని లిఖించింది. మంచిర్యాల జిల్లా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో నిర్మాణం పూర్తైన తొలి దశలోనే 5 మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ విద్యుత్తు ఉత్పాదన ప్రారంభించింది. శుక్రవారం మధ్యాహ్నం గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. దీనిపై సింగరేణి సీఎండి ఎన్ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ కార్మకులందరికీ అధికారులు, సిబ్బంధికి, అభినందనలు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
సౌర విద్యుత్ ఉత్పత్తిలోకి సింగరేణి