Singareni Employees Strike: సింగరేణి కార్మికుల సమ్మె సైరన్‌.. మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం!

Singareni Collieries: నాలుగు బొగ్గు గనుల్ని సింగరేణి సంస్థకు కేటాయించకుండా.. వాటిని వేలం వేయాలని కేంద్రం భావిస్తుండడంతో సింగరేణి కార్మికుల సమ్మె సైరన్‌ మోగనుంది. ఇందుకు తెలంగాణ సర్కార్‌‌ కూడా మద్దతు తెలుపుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 07:18 PM IST
  • బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికుల సమ్మె
  • ప్రాంతీయ లేబ‌ర్ క‌మిషన‌ర్‌‌తో జరిపిన చర్చలు విఫలం
  • లేబర్‌‌ కమిషనర్‌‌కు సమ్మె నోటీసులు ఇచ్చిన కార్మిక సంఘాల నేతలు
  • మద్దతుగా నిలవనున్న తెలంగాణ ప్రభుత్వం
Singareni Employees Strike: సింగరేణి కార్మికుల సమ్మె సైరన్‌.. మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం!

Singareni Coal Mine Blocks Auction: బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రాంతీయ లేబ‌ర్ క‌మిషన‌ర్‌‌తో ఇవాళ సింగ‌రేణి కార్మిక సంఘాలు చేపట్టిన చర్చలు విఫలం కావడంతో సమ్మె సైరన్ మోగడం ఖాయమైంది. సింగరేణి కార్మిక సంఘాలు అయిన టీబీజీకేఎస్, బీఎంఎస్‌తో పాటు  ఐఎన్‌టీయూసీ సంఘాల నేతలు లేబర్‌‌ కమిషనర్‌‌కు ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చారు. నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేయాలని చూస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి కార్మికులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

కాగా సింగరేణి విషయంలో కేంద్ర సర్కార్‌‌తో... తెలంగాణ ప్రభుత్వం మరో యుద్ధానికి దిగుతోంది. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏమీ చేయలేదంటూ సీఎం కేసీఆర్... కేంద్రంపై విరుచుకపడ్డ విషయం తెలిసిందే. ఇక మంత్రి కేటీఆర్ సింగరేణి సమస్య ద్వారా కేంద్రాన్ని ఇరుకున పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

తెలంగాణలోని నల్ల బంగారాన్ని మరింత వెలికి తీయాల్సింది పోయి వేలం వేసి అమ్మకానికి పెడతారా అంటూ తాజాగా కేటీఆర్ మండిపడ్డారు. అంతేకాదు  ఈ మేరకు కేంద్రానికి ఒక లేఖ రాసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. 

అలాగే నిన్నటి వరకు రైతులను నల్ల చట్టాలతో ముంచేందుకు కుట్ర పన్నిన కేంద్రం ఇప్పుడు నల్ల బంగారంపై కూడా కన్నేసిందంటూ కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేట్‌ పరం చేస్తే మాత్రం తెలంగాణ సమాజం అంతా బీజేపీపై రాజకీయంగా వేటు వేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. 

మంచి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి సింగరేణి జోలికి వస్తే.. సింగరేణి కార్మికుల సెగ ఢిల్లీకి తగులుతుందంటూ హెచ్చరించారు. సింగరేణి విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ మంత్రి కేటీఆర్‌ తాజాగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి రాసిన లెటర్‌‌లో పలు విషయాలను ప్రస్తావించారు. 

రైతుల పోరాటాన్ని మరిపించే విధంగా సింగరేణి కార్మికులు కేంద్రంపై మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారంటూ లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. సింగరేణిని ఎలా అయినా కాపాడుకుంటామంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తూ భరోసా ఇస్తామన్నారు. సింగరేణి కార్మికులతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడుతామంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు. 

జేబీఆర్‌ ఓసీ 3, కేకే 6తో పాటు శ్రవణపల్లి ఓసీని.. కోయగూడెం గనుల్ని సింగరేణి సంస్థకు కేటాయించకుండా వేలం వేయాలని కేంద్రం భావించడాన్ని కేటీఆర్‌‌ తప్పుపట్టారు. మంచి ఆదాయం ఇస్తోన్న సింగరేణిని మరింత బలోపేతం చేయాల్సిందిపోయి నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలనుకోవడం సరికాదన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత ఏడేళ్లో దాదాపు 670 లక్షల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి సింగరేణి నుంచి జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. సింగరేణి (Singareni) అనేది కోల్‌ మైన్‌ కాదని ఎంతో మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని కల్పిస్తోన్న గోల్డ్‌ మైన్‌ అని కేటీఆర్‌ (KTR) తెలిపారు.

Also Read: Hijab controversy: హిజాబ్ వివాదం భయాలు- మూడు రోజులు స్కూళ్లు, కాలేజీలు బంద్​!

Also Read: Oscar 2022 Nominations: ఆస్కార్ 2022 నామినేషన్స్‌కి పోటీపడుతున్న చిత్రాల్లో జై భీమ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News