Telangana: ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

తెలంగాణ (Telangana) లో మరో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) సంభవించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢికొని ఆరుగురు ఆరుగురు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెర్వు పాటి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Last Updated : Nov 10, 2020, 07:11 AM IST
Telangana: ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

Road Accident - six persons killed: హైదరాబాద్: తెలంగాణ (Telangana) లో మరో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) సంభవించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢికొని ఆరుగురు ఆరుగురు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెర్వు పాటి సమీపంలోని (Sangareddy Patancheruvu) ఔటర్ రింగ్ రోడ్డు (Nehru Outer Ring Road) పై మంగళవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేరే రాష్ట్రాలకు చెందిన కొంతమంది హైదరాబాద్ నుంచి పటాన్‌చెర్వు ఓఆర్ఆర్‌పై బోలేరోలో వెళ్తుండగా..  పాటి గ్రామ సమీపంలో వెనుకనుంచి వస్తున్న మరో గుర్తు తెలియని వాహనం బలంగా ఢికొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారితోపాటు ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ప్రమాద సమయంలో కారులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. 

పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పటాన్ చెర్వు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతోపాటు మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే మృతులందరూ జార్ఖండ్‌‌ (Jharkhand)కు చెందిన కార్పెంటర్లుగా పోలీసులు గుర్తించారు. వారంతా గచ్చిబౌలి నుంచి జార్ఖండ్‌ వెళ్తుండగా..ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. Also read: Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఇదిలాఉంటే.. నిన్న జగిత్యాల జిల్లాలో ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టిన ఈ ఘటనలో ఆదివారం అర్థరాత్రి నలుగురు ప్రాణాలు (Four persons killed) కోల్పోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు మహిళలు ఉండగా.. ఇద్దరు చిన్నారులు ఉన్నారు. 

Bihar Election Result: బీహార్ కింగ్ ఎవరు?.. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News