సీఎం కేసీఆర్ కు తృటిలో తప్పిన ప్రమాదం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖరరావుకు తృటిలో  ప్రమాదం తప్పింది. 

Last Updated : Feb 27, 2018, 03:46 PM IST
సీఎం కేసీఆర్ కు తృటిలో తప్పిన ప్రమాదం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖరరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. హెలికాఫ్టర్ లోని కమ్మ్యునికేషన్ బ్యాటరీ కిట్ బ్యాగ్ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది ఆ బ్యాగ్ ను దూరం తీసుకెళ్లి పడేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లా ఆర్మూర్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.

ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను సీఎంవో కార్యాలయం అధికారులతో మాట్లాడాడని.. అంతా సవ్యంగానే ఉందని పేర్కొన్నారు. సీఎం పర్యటన యథావిధిగా జరుగుతుందని తెలిపారు.

 

Trending News