New MMTS Services in Hyderabad-Secundrabad: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు అదనంగా 40 ఎంఎంటీఎస్ సర్వీసులను నడపబోతోంది. ప్రస్తుతానికి ఎంఎంటీఎస్ రైళ్లు హైదరాబాద్ లో లక్షలాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.
టికెట్ నామమాత్రంగా ఉండడంతో పాటు సుదూర ప్రాంతాలకు సైతం ఈ రైళ్లు వెళుతూ ఉండడంతో అనేకమంది ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక తాజాగా దక్షిణ మధ్య రైల్వే రైళ్ల సర్వీసులను పెంచడం కాకుండా వాటి గమ్యస్థానాలను సైతం పొడిగించడం రెండు నగరాల వాసులకు ఊరట నిచ్చినట్లు అయింది. ఇక తాజాగా సికింద్రాబాద్ మేడ్చల్ మధ్య కొత్తగా 20 ఎంఎంటీఎస్ సర్వీసులు పరుగులు పెట్టనున్నాయి.
Also Read: Samantha vs Lawrence: డిజాస్టర్ దిశగా 'శాకుంతలం'.. షాకిస్తూ దూసుకుపోతున్న రుద్రుడు!
అలాగే ఫలక్నామా -ఉందా నగర్ మధ్య 25 రైళ్ల గమ్యస్థానాలను కూడా దక్షిణ మధ్య రైల్వే పెంచింది. గతంలో సికింద్రాబాద్ మీదుగా ఫలక్నామా వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పుడు ఉందా నగర్ వరకు సేవలు అందించబోతున్నాయి. ఈ రైలు సర్వీసులతో కలిపి హైదరాబాద్ జంట నగరాల్లో ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్య ఇప్పుడు 106 కు చేరింది.
ఇక హైదరాబాద్ నగరవాసులకు ప్రస్తుతానికి మెట్రో రైలు కూడా సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎంఎంటీఎస్ రైళ్లతో పోలిస్తే మెట్రో రైళ్లలో భారీగా ధరలో ఉండటంతో ఎక్కువ మంది ఎంఎంటీఎస్ రైళ్లలోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే కూడా ఎంఎంటిఎస్ సేవలు పెంచేందుకు ఆసక్తి చూపిస్తుంది.
ఇక ఈ ఎంఎంటీఎస్ రైళ్లను భువనగిరి వరకు నడపాలనే డిమాండ్ కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందేమో చూడాల్సి ఉంది. ఇక జంట నగరాల ప్రజలు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే ఆదివారం నాడు ఈ ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండవు. ఉద్యోగస్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడిన ఈ ఎంఎంటీఎస్ సర్వీసులు కేవలం సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే పరుగులు పడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
New MMTS Services: జంటనగర వాసులకు గుడ్‌న్యూస్..కొత్తగా 20 ఎంఎంటీఎస్ రైళ్లు!